తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. దీంతో మొన్నటి వరకు గెలుపు కోసం వ్యూహాలను రచించడంలో బిజీ బిజీగా ఉన్న పార్టీలు ఇప్పుడు కాస్త సైలెంట్ అయిపోయాయి అని అందరూ అనుకుంటున్నారు. కానీ పరిస్థితి మరోలా ఉంది. పార్లమెంట్ ఎన్నికల ముగిసాయో లేదో అంతలోనే ఇక అన్ని పార్టీలకు మరో టెన్షన్ పట్టుకుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరగబోతుంది అని చెప్పాలి. పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఉన్న పళ్ళ రాజేశ్వర్ రెడ్డి బిఆర్ఎస్ నుండి జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో చివరికి ఉప ఎన్నిక అనివార్యంగా మారిపోయింది. ఇక ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ఈనెల 27వ తేదీన జరగబోతుంది అని చెప్పాలి.
 అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న బి ఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి బిజెపి నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు అని చెప్పాలి. అంతేకాకుండా ఇక వివిధ పార్టీల నుంచి ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు మొత్తం కలుపుకొని 52 మంది అభ్యర్థులు ఇక ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. అయితే మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం ప్రచారంలో దూసుకుపోయిన పార్టీలన్నీ ఇక ఇప్పుడూ ఈ ఉపఎన్నికకు సంబంధించిన ప్రచారం నిర్వహించడం మొదలుపెట్టాయ్



 అయితే 2021 లో బిఆర్ఎస్ నుంచి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడ్డారు. ఇక ఈ పోటీలో పళ్ళ రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. తీన్మార్ మల్లన్న కొద్ది తేడాతో ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఆయన ఏకంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు  అయితే ఈసారి కూడా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉఎన్నికలో ప్రధాన పోరు ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే గతంలోనే పట్టభద్రుల ఇక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటింగ్ నమోదు చేసుకున్నప్పటికీ ఓటు వేసేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే మూడు జిల్లాల్లో కలిపి పట్టభద్రులు లక్షల్లోనే ఉన్నారు  కానీ ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఈనెల 27వ తేదీన జరిగే ఎన్నికల్లో ఇక పట్టపద్రులను అటు పోలింగ్ కేంద్రం వరకు రప్పించడం అనేది పార్టీలకు పెద్ద సవాల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mlc