తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ పై బ్యాన్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యాయి. మరో 18 రోజుల్లో ఏ రాజకీయ పార్టీకి అనుకూల ఫలితాలు రానున్నాయో తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ విషయంలో బ్యాన్ విధించడంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ విషయంలో గందరగోళం నెలకొంది. కూటమిదే పైచేయి అనేలా టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసినా ఆ మాటలు వట్టిమాటలే అని ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది.
 
అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ బెట్టింగ్ బంగార్రాజులకు హైబీపీ తెప్పిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు మహానాడు వాయిదా పడటం కూటమి కార్యకర్తలను ఒకింత కంగారు పెడుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు జరగాల్సి ఉన్నా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మహానాడు వాయిదా పడిందని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
 
మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని బెట్టింగ్ బంగార్రాజులకు హైబీపీ, కన్నీళ్లు తెప్పిస్తున్నారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీదే అధికారం అని జగన్ తేల్చి చెప్పిన నేపథ్యంలో జగన్ కామెంట్లు నిజమైతే కోట్ల రూపాయలు పోయినట్టేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతలు గెలుస్తారని బెట్టింగ్ కట్టిన వాళ్లకు జగన్ తన కామెంట్లతో రక్త కన్నీరు తెప్పిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
 
రాష్ట్రంలో బెట్టింగ్ అనేది నిషిద్దమైనా కొన్ని ప్రాంతాలలో అనధికారికంగా ఈ బెట్టింగ్ కొనసాగుతుంది. అభ్యర్థుల గెలుపు విషయంలో, మెజారిటీ విషయంలో ప్రధానంగా ఈ బెట్టింగ్ లు కొనసాగుతున్నాయి. ఏపీలో పోలింగ్ పూర్తైన నేపథ్యంలో బెట్టింగ్ ల గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. పోల్ మేనేజ్ మెంట్ విషయంలో సక్సెస్ కావడంతో జగన్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని తెలుస్తోంది. జగన్ పక్కా లెక్కలతోనే ఈ కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది. గెలుపు విషయంలో జగన్ లెక్కలు వేరే ఉన్నాయని సమాచారం.


 


మరింత సమాచారం తెలుసుకోండి: