ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున గొడవలు హింసాత్మక  సంఘటనలు కూడా జరగడంతో చాలామంది నేతలు కూడా ఫైర్ అయ్యారు. అయితే ఆ గొడవలు అలాగే నెమ్మదిగా రోజురోజుకి హింసాత్మకమైన ఘటనలుగా మారడంతో ఈ విషయాన్ని చాలామంది సీరియస్గా తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదులు చేయడంతో చర్యలు చేపట్టింది.. ఆంధ్రప్రదేశ్ సీఎస్, డీజీపీ వివరణ అనంతరం పలు చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.. పల్నాడు అనంతపురం జిల్లా ఎస్పీ ల పైన సస్పెన్షన్ వేటు వేసింది.. అలాగే తిరుపతి ఎస్పీ.. పల్నాడు జిల్లా కలెక్టర్ తో పాటు అనంతపురం డిఎస్పీల.. తిరుపతి డిఎస్పీలప పైన కూడా ఈ సస్పెన్షన్ వేటు పడింది.


మరొకవైపు మరో మూడు జిల్లాలలో 12 మంది కింద స్థాయి అధికారులను కూడా సస్పెన్షన్ చేసినట్లుగా తేలుస్తుంది. ఇలా అధికారుల పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్రంలో హింసప్ పైన బ్రతికేసి కూడా చాలా ప్రత్యేకంగా తీసుకోవాలని కూడా ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా ప్రతి కేసు పైన సిట్ ఏర్పాటు చేసి మరో రెండు రోజులలో నివేదికలు అందించాలని కూడా తెలిపింది..


అలాగే ఎఫ్ఐఆర్లు పెట్టి, ఐపిసి అన్ని సెక్షన్ల కింద కూడా కేసులో నమోదు చేయాలంటూ ఆదేశాలను జారీ చేసింది.. రాష్ట్రంలో మరో 15 రోజులు కేంద్ర బలగాలను కూడా ఊహించేలా ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి శాఖకు కూడా ఆదేశాలు జారీ చేసింది ఈజీ.. అలాగే పోలింగ్ అనంతరం హింస పైన కఠినంగా వ్యవహరించాలని సిఎస్ ,డిజిపి కి కూడా ఆదేశాలు జారీ చేశారు. దాదాపుగా 25 పారా మిలిటరీ బలగాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దించినట్లుగా తెలుస్తోంది. వీరంతా కూడా 15 రోజులపాటు ఆంధ్రప్రదేశ్ లోనే కొనసాగునున్నారు.. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే హింసను  సైతం అదుపులోకి ఉంచేలా ఈ బలగాలను వినియోగించుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: