అనంతపురం జిల్లా తాడిపత్రిలో గత రెండు మూడు రోజుల నుంచి టిడిపి వైసిపి నేతల మధ్య వార్ నడుస్తూనే ఉంది. ముఖ్యంగా తాడిపత్రిలో జెసి బ్రదర్స్ హవ గత కొన్ని లుగా కొనసాగుతూనే ఉంది.. అయితే 2019లో పెద్దారెడ్డి గెలిచినప్పటి నుంచి వీరి హవా తగ్గిపోతూ వస్తోంది. దీంతో ఇటివలె ఓటింగ్ అయిపోయినప్పటికీ అటు వైసిపి,టిడిపి నేతలు మధ్య మాటల యుద్ధమే కాకుండా కొట్టుకోవడం ఒకరి ఇంటిపైన మరొకరు పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు వంటివి వేసుకోవడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.. దీంతో పోలీసు అధికారులు  జేసి దివాకర్ రెడ్డి, జెసి ప్రభాకర్ రెడ్డి కుటుంబాలను తాడిపత్రి నుంచి దూరంగా పంపిస్తున్నట్లు తెలుస్తోంది. జెసి సోదరుల ఇంట్లో పనిచేసే వారందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


ఈనెల 14వ తేదీన తాడిపత్రిలో టిడిపి నాయకుడు సూర్యముని ఇంటి పైన దాడి జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున కూడా ఘర్షణలు మొదలయ్యాయి అలా ఇరువురు నేతల మధ్య ఘర్షణలు జరగడంతో జేసి ఇంట్లో పనిచేసే వారందరిని అరెస్టు చేశారు డీఎస్పీ చైతన్య.. అలాగే దివాకర్ రెడ్డి భార్య విజయమ్మ, సోదరి సుజాతమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు.. వీరికి మందులు అందించే వారిని కూడా నిన్నటి రోజున తెల్లవారుజామున డిఎస్పి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


అయితే తన తల్లి మేనత్త బాగోగులు చూసుకునేందుకు దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి నిన్నటి రోజున తాడిపత్రికి రాగా పోలీసులు ఆయన పైన కూడా ఆంక్షలు విధించారు.. మీరు అసలు తాడిపత్రిలోనే ఉండకూడదని ఒకవేళ ఉంటే గృహనిర్బంధం చేస్తామంటూ కూడా పోలీసులు ఆంక్షలు విధించారు.. దీంతో పోలీసుల వద్ద వాదించినప్పటికీ చేసేదేమీ లేక చివరికి కుటుంబ సభ్యులను తీసుకొని పవన్ తాడిపత్రిని విడిచి హైదరాబాద్ కి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: