దేశవ్యాప్తంగా బీజేపీ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది ప్రధాని నరేంద్ర మోడీ.ప్రస్తుతం మన దేశ ప్రధానిగా ఉన్నారు. అలాంటి మోడీ కేవలం ప్రధానిగా మాత్రమే ఉన్నారు కానీ అందులో నిర్ణయాలు తీసుకునేది మాత్రం అమిత్ షా అని తెలుస్తోంది. బిజెపి పార్టీలో ఏది జరగాలన్న అమిత్ షా నిర్ణయమే ఫైనల్ గా ఉంటుంది. ఎలాంటి అమిత్ షా  మరియు నరేంద్ర మోడీ మధ్య  చిచ్చురేగినట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఏంటో చూద్దాం.. ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వస్తుంది అంటే ఆ పార్టీలో ఉన్న నేతలే చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటిది నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే  ప్రధాని ఎవరు అనే దానిపై ఈమధ్య అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి.

 మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.  2019 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నితిన్ గడ్కారి మధ్య  పెద్ద చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. మేము నరేంద్ర మోడీ ప్రధాని అంటే అంగీకరించమని, ఆయన వ్యవహార శైలి నచ్చలేదని, అతన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతామని, నితిన్ గడ్కరీ నే ప్రధానమంత్రి ని చేయాలని ఆయన మాట్లాడారు. కానీ బిజెపికి సంబంధించిన నాయకులంతా గడ్కరీ అవసరం లేదు ప్రధాని మోడీ అయితేనే బాగుంటుందని మోడీని ప్రధానిని చేశారు. ఇదే తరుణంలో  ఎన్డీఏకు సపోర్ట్ చేయని చంద్రబాబు యుపిఏ ప్రభుత్వానికి సపోర్ట్ అందించారు. ప్రస్తుతం ఇదే పాలసీని కేజ్రీవాల్ కూడా పాటిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రధాని మోడీ కాకుండా అమిత్ షా ని ప్రధానిని చేయాలనే ప్రతిపాదన ఆయన చేశారు.

కాబోయే ప్రధాని అమిత్ షా అని రెండేళ్లలో మోడీని దించి మరీ అమిత్ షా ప్రధాని అవుతారని వారిద్దరి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేజ్రివాల్. కానీ ఎవరు ఏం చెప్పినా కానీ ఈ ఇద్దరు కాషాయాన్ని ఇమిడింప చేసుకున్నారు. ఇన్ని సంవత్సరాల రాజకీయ వ్యవస్థలో అన్ని చదివారు. ప్రణాళిక పద్ధతితో పార్టీని స్థాయికి ఓ తీసుకొచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి తన మంచితనంతో పోగొట్టుకున్నటువంటి  విషయాలను వీరు గమనించి అలా ఉంటే నడవదు మనం ఎక్కడ కఠినంగా ఉండాలి ఎక్కడ  ఎలా ఉండాల అనే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నారు. అలా ఉన్నారు కాబట్టే ఇప్పటివరకు వారు దేశంలో ఏకధాటిగా పాలన చేస్తున్నారు. ఇలాంటి వీరిద్దరి మధ్య ఎంత చిచ్చు పెట్టాలనుకున్నా ఆ పెట్టిన వారే ఇబ్బందుల్లో పడతారు కానీ వీరిద్దరి మధ్య చిచ్చు చెలరేగే అవకాశం అస్సలు ఉండదని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: