ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న బిఆర్ఎస్ పార్టీకి ఒక్కసారి ప్రతిపక్షంలోకి రాగానే విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే  కారు పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన వారు సైతం కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇక సిట్టింగులుగా ఉన్నవారు సైతం ఇలా హస్తం పార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో అందరూ ఇలా వెళ్లిపోవడంతో కెసిఆర్ అయోమయంలో పడిపోయారు.


 దీంతో గులాబీ పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలోనే అటు బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ కు మెజారిటీ రాకుండా చూడాలని పట్టుదల పెట్టుకుంది. దీనికోసం తాము ఓడిపోయిన పరవాలేదు కానీ ఇక కాంగ్రెస్ మాత్రం గెలవద్దు అనే పంతంతోనే ముందుకు సాగిందట కారు పార్టీ. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పంతాన్ని నెక్కించుకుంది అన్నది తెలుస్తుంది  ఎందుకంటే క్రాస్ ఓటింగ్ ద్వారా కాంగ్రెస్ను ఓడించాలని అనుకుందట. ఎక్కడ బలమైన అభ్యర్థులు లేని ప్రతి చోట ఇక కారు పార్టీకి రావలసిన ఓటింగ్ మొత్తాన్ని కూడా బిజెపికి పడేలా చేయడంలో సక్సెస్ అయిందట బిఆర్ఎస్.


 ఇప్పటికే రాష్ట్రంలో మోడీ మేనియా కొనసాగుతూ ఉండడం.. దానికి తోడు ఇక కారు పార్టీ కార్యకర్తలు అందరూ పైనుంచి గ్రౌండ్ లెవెల్  వరకు అందరూ కూడా కాంగ్రెస్ కు ఎక్కడ మెజారిటీ రావద్దు అని లక్ష్యాన్ని పెట్టుకున్నారట. దీంతో కాంగ్రెస్ గెలవకుండా బి ఆర్ ఎస్ ఓడిపోయే పరిస్థితి ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో ఇక అందరూ బిజెపికి ఓట్లు గుదేశారట. ఇలా క్రాస్ ఓటింగ్ ద్వారా బిఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ ను గెలవకుండా చేసి చివరికి పంతాన్ని ఆ పార్టీ పంతాన్ని నెగ్గించుకుందంటు అంటూ ఒక టాక్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Brs