మెగా బ్రదర్ నాగబాబు ఆవేశంతో చేస్తున్న కొన్ని పనుల వల్ల మెగా ఫ్యామిలీకి, జనసేన పార్టీకి తీరని నష్టం కలుగుతోందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అల్లు అర్జున్ స్థాయిని కించపరిచేలా కొన్నిరోజుల క్రితం ట్వీట్ చేసిన నాగబాబు తాజాగా ఆ ట్వీట్ ను డిలేట్ చేశానని ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే అడుసు తొక్కనేల కాలు కడగనేల అంటూ అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.
 
నాగబాబు తప్పు చేయడమెందుకు ? ఆ తప్పును సరిదిద్దుకోవాలని ప్రయత్నించడం ఎందుకు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మెగా ఫ్యామిలీ గురించి కానీ, జనసేన గురించి కానీ బన్నీ ఏరోజైనా నోరు జారి కామెంట్ చేశారా? అనే ప్రశ్నలు సైతం ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో పోతిన మహేశ్ మెగా ఫ్యామిలీ దగా ఫ్యామిలీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
 
నాగబాబుకు, జనసేనకు అల్లు అర్జున్ చేసిన సహాయాన్ని వివరిస్తూ నాగబాబు కృతజ్ఞత మరిచి అల్లు అర్జున్ గురించి కామెంట్ చేశారనేలా పోతిన మహేశ్ రియాక్ట్ అయ్యారు. పాముకు పాలు పోసినా పాము కాటు వేస్తుందని స్నేహం, నమ్మకం విలువ వాడుకుని వదిలేసే వాళ్లకు తెలుస్తుందా అని ఆయన ప్రశ్నించారు. నాగబాబు ఆర్థిక స్థితి బాలేదని తెలిసి నా పేరు సూర్య సినిమాకు నాగబాబును కో ప్రొడ్యూసర్ గా పెట్టించి 3 కోట్ల రూపాయలు బన్నీ ఇప్పించాడని ఆయన తెలిపారు.
 
నాగబాబుకు మరో రెండు సినిమాల్లో రోల్స్ ఇప్పించి బన్నీ ఆదుకున్నాడని పోతిన మహేశ్ అన్నారు. 2019లో బన్నీ జనసేనకు 2 కోట్ల విరాళం ఇచ్చినా నాగబాబు విషం చిమ్ముతున్నాడని ఆయన పేర్కొన్నారు. మెగా ఫ్యామిలీకి అండగా నిలిచిన అల్లు కుటుంబంపై విమర్శలు చేసిన వాళ్లను మెగా ఫ్యామిలీ అనాలా? లేక దగా ఫ్యామిలీ అనాలా? అంటూ పోతిన మహేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్, నాగబాబు టార్గెట్ గా పోతిన మహేశ్ తరచూ విమర్శలు చేస్తున్నారు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: