తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17  పార్లమెంటు నియోజకవర్గాల్లో కీలకమైన  నియోజకవర్గం నిజామాబాద్. ఈ పార్లమెంటు స్థానంలో ఈసారి త్రిముఖ పోరు నడుస్తోంది. మూడు పార్టీల నుంచి ముగ్గురు సీనియర్ లీడర్లే పోటీ చేస్తున్నారు. ఇందులో ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం చాలా కష్టంగా మారింది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో బిజెపి పార్టీ నుంచి ధర్మపురి అరవింద్ బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు,  అలాగే బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బరిలో ఉన్నారు. అలాంటి ఈ తరుణంలో కేవలం బిజెపి, కాంగ్రెస్, మధ్య టఫ్ నెలకొందట. బిజెపి నాయకులు మాదే విజయం అని అంటుంటే, కాంగ్రెస్ నాయకులు మాది విజయమంటున్నారు.  

ఈ విధంగా ఇద్దరు నాయకులు ఒకరికి ఒకరు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి  గెలుపుపై భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మీడియా సమావేశంలో ఒక రిపోర్టర్ బిజెపి గెలుస్తుందని టాక్ వినిపిస్తోందని   ప్రశ్నించగా రిపోర్టర్ పై కాస్త  జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు.   ఇప్పటివరకు ఎలాంటి సర్వే రాలేదు.  బిజెపి గెలుస్తుందని ఎలా అంటున్నావు అని కాస్త కోపానికి వచ్చారు. నిజామాబాద్ లో టఫ్ ఫైట్ ఉన్నది.  చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ను ఓడించాలని, చాలా ఓట్లు బిజెపికి వేశారని, అయినా అక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.

అంతేకాకుండా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఓటింగ్ శాతం తక్కువగా కావడం కూడా కాంగ్రెస్కు కాస్త మైనస్ గా చెప్పవచ్చు. అలాగే అక్కడ ఎక్కువ మంది ముస్లిం మైనారిటీలు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా తక్కువ శాతం ఓటింగ్ నమోదు చేసుకున్నారట. ఇది కూడా జీవన్ రెడ్డికి మైనస్ గా మారే అవకాశం కనిపిస్తోంది.  అంతేకాకుండా ఆయనకు  జీవన్ రెడ్డి నిజామాబాద్ లో కొత్త అభ్యర్థి కావడం కూడా కాస్త మైనస్ గా చెప్పవచ్చు. అయినా ఆయనకు భారీగానే ఓట్ శాతం నమోదయింది కానీ, బీఆర్ఎస్ సంబంధించిన చాలా ఓట్లు బిజెపికి పడ్డట్టు తెలుస్తోంది. ఈ విధంగా జీవన్ రెడ్డి ఓటింగ్ సరళి పై స్పందిస్తూ టఫ్ ఫైట్ ఉందని చెబుతూనే గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: