- కడియం కావ్యను కాంగ్రెస్ వాళ్ళే కాటేసారా..?
- స్టేషన్ ఘన్ పూర్ కాంగ్రెస్ కు ఓట్లు పడలేదా..?
- బీఆర్ఎస్ క్యాడర్ బిజెపికి సపోర్ట్ చేసిందా.?

 తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత కీలకమైన నియోజకవర్గం వరంగల్.  ఈ పార్లమెంట్ బరిలో మహామహులు పోటీ చేశారు. కానీ పోలింగ్ శాతం పెరగడంతో ఎవరు గెలుస్తారనేది ఒక అంచనాకు రావడం కష్టంగా మారింది. ప్రధానంగా బిజెపి, కాంగ్రెస్ మధ్య  హోరాహోరీ ఉంటుందని అంచనాల అందుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నాయకులు అని చెప్పవచ్చు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. వరంగల్ పార్లమెంటు ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. ఒకసారి బిజెపి గెలిచింది. మధ్యలో టిడిపి ఓసారి పాగా వేసింది. ఇక బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి వరంగల్ పార్లమెంటు స్థానం పెట్టని కోటగా మారింది. కానీ ఈ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు వరంగల్ లో పాగా వేయాలని  ఎదురుచూస్తున్నాయి. గత వైభవం తెచ్చుకోవాలని కాంగ్రెస్, మరోసారి చరిత్ర చూపించాలని బిజెపి, హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ ఎస్ ఇలా మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి..


ఇక్కడ కాంగ్రెస్ నుంచి కడియం శ్రీహరి కూతురు కావ్య కు టికెట్ అందించారు. ఇక మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను బిజెపి బరిలో దింపింది.  ఇక బీఆర్ఎస్ హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ కు  టికెట్ అందించింది. దీంతో ఈ పార్లమెంటులో ముక్కోనపు పోటి నడుస్తోంది. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు. ఈ పార్లమెంటు పరిధిలో భూపాలపల్లి, పరకాల,వరంగల్ వెస్ట్,వరంగల్ ఈస్ట్,  స్టేషన్గన్పూర్, పాలకుర్తి,వర్ధన్నపేట ఉన్నాయి. 18 లక్షల 24 వేల మంది ఓటర్లు ఉన్నారు. అలాంటి ఈ పార్లమెంటు స్థానంలో ఆరుసార్లు కాంగ్రెస్ ఒకసారి బిజెపి,2 టిడిపి, 2సార్లు బీఆర్ఎస్  పాగా వేసింది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పార్లమెంటు ఎలక్షన్స్ లో ఏడు నియోజకవర్గాల్లో ఆరు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

 కడియం కొంపముంచిన కాంగ్రెస్:
 కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలోని ఒక కీలకమైన లీడర్. ఈసారి కాంగ్రెస్ హవా నడిచినా కానీ, ఆయన స్టేషన్ ఘనపూర్ నుంచి బీఆర్ఎస్ తరఫున విజయం సాధించారు. కానీ తన సొంత స్వలాభం కోసం పార్టీ మారి తన బిడ్డకు టికెట్ తెచ్చుకున్నారు. ఎలాగైనా తన కూతురు కావ్య గెలుస్తుందని ధీమాతో ఉన్నారు. కానీ ఆయన ఇక్కడే పప్పులో కాలేశారు.. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరడంతో  ఘన్పూర్ ఇతర నియోజకవర్గాల్లో ఉన్న క్యాడర్ కూడా డిసప్పాయింట్ అయిపోయారు. పార్టీ మారిన ఈ వ్యక్తిని ఎలా నమ్మాలని ఆలోచనకు వచ్చారు. దీంతో వరంగల్ ఎంపీగా పోటీ చేస్తున్న తన కూతురు కావ్య కు చురకలాంటించాలనుకున్నారు.  బీఆర్ఎస్ అభ్యర్థి గెలవకపోయినా సరే,  కాంగ్రెస్ గెలవకూడదని నినాదంతో చాలామంది  బీఆర్ఎస్ కు ఓటేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలే చర్చించుకోవడం మరింత చర్చ నియాంశంగా మారింది. అంతేకాకుండా  పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ కోసం  సీనియర్ లీడర్ లైన స్టేషన్ ఘనపూర్ లో ఓడిపోయిన సింగపూర్ ఇందిరా, దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పసునూరి దయాకర్ , వంటి ఎందరో ఆశావాహులు ఆశించారు. కానీ అనూహ్యంగా కావ్య కు కేటాయించడంతో ఈ నాయకులంతా  కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయడం పక్కన పెడితే,  మరో వ్యక్తి గెలవాలని కంకణం కట్టుకున్నారట. ప్రస్తుతం ఎన్నికల రిజల్ట్ దగ్గర పడుతున్న సమయంలో  ఈ బీఆర్ఎస్ క్యాడర్ బి ఆర్ ఎస్ నేతకు ఓట్లు వేయకుండా బిజెపికి వేశారని, దీనివల్ల కడియం కావ్యకు ఇబ్బందులు తప్పవని ప్రజలు  చర్చించుకుంటున్నారట. మరి చూడాలి ఇంత టఫ్ ఫైట్ లో కడియం కావ్య విజయం సాధిస్తుందా లేదంటే  మరొకరి చేతిలోకి వరంగల్ పార్లమెంట్ వెళ్ళిపోతుందా జూన్ 4వ తేదీన బయటపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: