పొలిటికల్పరంగా టిడిపి పార్టీలో చాలామంది చంద్రబాబు నాయుడు లోకేష్ కి సపోర్టు ఉండగా మిగతా సగం మంది జూనియర్ ఎన్టీఆర్ కు సపోర్టుగా ఉంటున్నారు.. ఈ విషయం ఎన్నోసార్లు బయటపడడం కూడా జరిగింది. గతంలో టిడిపి పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెట్టిందని విమర్శలు కూడా ఎక్కువగా వినిపించాయి.. అంతేకాకుండా చాలా సార్లు.. లోకేష్ ప్రజలలో ఎదురైనప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి కొషన్లు ఎదురవుతూ ఉండేవి. నిన్నటి రోజున జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా లోకేష్ బాధ్యతగా వ్యవహరిస్తూ ఒక పోస్టు షేర్ చేశారు.




ముఖ్యంగా టిడిపి పార్టీకి ఎక్కడైతే సంక్లిష్ట పరిస్థితి ఎదురవుతుందో.. ఆ సమయంలోనే లోకేష్ ఆ బాధ్యతలను ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ సుదీర్ఘంగా వదిలేసినటువంటి విద్యార్థి , యువజనులను  ఆకర్షించేందుకోసం యువ గళం పాదయాత్రను కూడా మొదలుపెట్టారు. ఇక్కడ తెలుగుదేశం అభిమానులలో పార్టీ మీద ఎంత అభిమానం ఉందో.. జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా అంతే అభిమానం ఉన్నది. పార్టీ వీర కార్యకర్తలు మాత్రం చంద్రబాబు దేవుడు .. మిగతా వాళ్లంతా వేస్ట్ అనుకునే వాళ్లు జూనియర్ ఎన్టీఆర్ నిందించవచ్చు, దూషించవచ్చు.. కానీ తెలుగుదేశం సానుభూతిపరులు.. తెలుగుదేశం ఓటర్లకి జూనియర్ ఎన్టీఆర్ ని దూరం చేయడం ఇష్టం ఉండదు.


అలాంటి వాళ్ళ మనసుని సైతం బేస్ చేసుకొని లోకేష్ బాధ్యతగా పాత్రను పోషించారు. ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ విషయం పైన జూనియర్ ఎన్టీఆర్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు. థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ లోకేష్ అంటూ రిప్లై ఇచ్చారు. ఇది లోకేష్ యొక్క బాధ్యతకరమైన ట్విట్ అని కూడా చెప్పవచ్చు. ఎవరెవరు ఏం మాట్లాడుకున్నా కుటుంబం అంతా కూడా కలిసే ఉండేలా చూడడం ముఖ్యమని లోకేష్ ఇలా బాధ్యతగా వ్యవహరించారు. దీన్ని బట్టి చూస్తే గతంలో కంటే లోకేష్ ప్రస్తుతం చాలా మారిపోయారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ మార్పు రాజకీయంగా లోకేష్ కు ఎదగనిచ్చేలా సహాయపడుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: