ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాంకర్ శ్యామల హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీకి సపోర్ట్ చేశారు. ఆ పార్టీ అభ్యర్థుల తరుఫున ఎన్నికల ప్రచారం కూడా చేశారు.టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా పవన్ కల్యాణ్ జనసేన , టీడీపీకి అండగా నిలిచిన తరుణంలో శ్యామల ఒక్కరే వైసీపీకి సపోర్ట్ చేశారు. కనీసం అల్లు అర్జున్ లాగా రెండు పార్టీలకు కూడా సపోర్ట్ చేయలేదు. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉంటే ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు లేకుండా చేస్తారనే టాక్ చాలా బలంగా ఉంది. అలీ, పోసాని వంటి గొప్ప పేరున్న నటులకు కూడా ఇప్పుడు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దానికి కారణం కూడా మెగా ఫ్యామిలీయే అనే టాక్ ఉంది.అయినా కూడా డేర్ చేసి యాంకర్ శ్యామల వైసీపీకి అండగా నిలిచారు. అయితే ఆమె వైసీపీకి సపోర్టు చేసిన దగ్గర నుంచి కూడా మెగా ఫ్యామిలీ అభిమానులు శ్యామలను టార్గెట్ చేసుకుని ఘోరంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా టీడీపీ, జనసేనకు సంబంధించిన కొందరు శ్యామల వ్యక్తిగత జీవితంపై కూడా కామెంట్స్ చేశారు. శ్యామల చీకటి బాగోతాలు ఎవరికి తెలియవంటూ ఉండవల్లి అనూష, నటుడు పృథ్వీ వంటి వారు ఆమెనుద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు.


ఇలాంటివి ముందే ఊహించి వైసీపీకి సపోర్ట్ చేశానని యాంకర్ శ్యామల ఓ ఇంటర్య్వూలో తెలపడం జరిగింది.ఇదే ఇంటర్య్వూలో ఆమె ముసలి నక్క, తోడేలు గురించి చెప్పిన కథ సూటికి ఎవరికి తగలాలో వారికే తగలడంతో మెగా ఫ్యాన్స్, టీడీపీ ఫ్యాన్స్ శ్యామలపై మండిపడుతోంది. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. నేతల ఫలితాలు మరో రెండు వారాల్లో తేలిపోయినున్నాయి. ఇలాంటి తరుణంలో మరోసారి శ్యామలను టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా బెంగళూరులో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఆ పార్టీలో సినీ , రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్లు సమాచారం తెలిసింది. హీరో శ్రీకాంత్, హేమ, జానీ మాస్టర్ ఉన్నట్టు బాగా ప్రచారం జరిగింది. అయితే తాము ఆ పార్టీలో లేమని ఈ ముగ్గురు కూడా ఆల్రెడీ ప్రకటించారు. అయితే సడన్‌గా యాంకర్ శ్యామలా హేటర్స్ మీడియాలో రేవ్ పార్టీలో పట్టుపడ్డ ప్రముఖ యాంకర్ అంటూ వార్తలు వైరల్ చేశారు. ఆమెని చాలా దారుణంగా పచ్చి బూతులు తిడుతూ పర్సనల్ అటాక్ చేస్తూ హింసిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: