ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13 వ తేదీన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు భారీ ఎత్తున జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ ఎన్నికలు జరగడానికి ముందే చాలా రోజుల నుండి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతూ వస్తుంది. ఇక మే 13 వ తేదీన ఎలక్షన్ లు పూర్తి కావడంతో రిజల్ట్ కి ఒకటి , రెండు రోజుల ముందు మళ్ళీ ఇలాంటి వాతావరణం ఉంటుంది. ఈ మధ్య లో ఉన్న రోజులు అంతా చాలా ప్రశాంతంగా ఉంటాయి అని ఆంధ్ర ప్రజలు అనుకున్నారు.

కానీ ఇప్పుడు కూడా అనేక హాట్ పరిణామాలు నెలకొంటూ ఉన్నాయి. ఎలక్షన్ డే రోజు కొన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున గొడవలు జరిగాయి. దానితో అనేక కొత్త పరిణామాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఇక ఎలక్షన్ లు పూర్తి కావడంతో తన కుటుంబంతో కలిసి జగన్ విదేశాలకు బయలు దేరాడు. దానితో మరో సమస్య ఆంధ్ర రాష్ట్రంలో పుట్టుకొచ్చింది. జగన్ విదేశాలకు పారిపోయాడు.

అతను ఇక తిరిగి రాడు అనే ప్రచారాలను మొదలు పెట్టారు. అలాగే జగన్ వెళ్లిన ప్రత్యేక విమానం నాలుగు గంటలు ఆలస్యంగా ల్యాండ్ కావడంతో ఎందుకు అలా అయ్యింది , అతను ఎవరినో కలిశాడు అలా అనేక వార్తలు తెరపైకి వచ్చాయి. ఇక చంద్రబాబు కూడా విదేశాలకు వెళ్ళాడు. దానిపై కూడా కొంత మంది రకరకాలైన అభిప్రాయాలను తెలియ జేస్తూ వస్తున్నారు. ఇలాంటి హిట్ పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ఇక తాజాగా మరో అంశం తెర పైకి వచ్చింది.  

అమెరికా గ్రీన్ కార్డు కోసం EB 5 విధానంలో వల్లభనేని వంశీ దరఖాస్తు చేసుకున్నారు అని , ఎన్నికల తర్వాత అమెరికాలోని డల్లాస్ వెళ్ళిపోతాడు అని , ఆయన అమెరికాలోని శాశ్వత సభ్యత్వం కోసం టెక్సాస్ నుండి EB 5 విధానం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు అని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. ఇలా ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో విదేశాలకు వెళ్ళనున్న , వెళ్ళబోతున్న నేతల గురించి ఎక్కువ వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: