కూటమికి ఈసారి ఉద్యోగులందరూ వేసి ఉంటారని భావిస్తున్నారు.తాజాగా పోస్టల్ బ్యాలెట్ ల పైన కూడా కూటమి టెన్షన్ మొదలవుతున్నట్లు తెలుస్తోంది.. గెజిటెడ్ అధికారి సంతకం ఉంటేనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులు పరిగణంలోకి తీసుకుంటారని విషయం ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.. ఒకవేళ ఆ సంతకం లేకపోతే కచ్చితంగా ఆ ఓటు చల్లని ఓటు కిందికి వస్తుందట. పోస్టల్ బ్యాలెట్ పైన అవగాహన లేకపోవడంతో గెజిటెడ్ అధికారి సంతకం లేకుండానే చాలామంది ఉద్యోగులు ఓట్లు వేసి ఉంటారని చర్చ కూడా ఇప్పుడు తెరపైకి వస్తోంది.


అయితే గెజిటెడ్ అధికారి సంతకం లేకున్నప్పటికీ ఆ ఓట్లను పరిగణంలోకి తీసుకోవాలంటూ కూటమి నేతలు ఈసీకి తెలియజేయడం జరిగింది. దీన్నిబట్టి చూస్తే పోస్టల్ బ్యాలెట్ల పైన కూడా కూటమికి కాస్త భయం కలిగేలా కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైన గతానికి ఇప్పటికి చాలా తేడానే ఉంది. ఈ దఫా ఎక్కువగా ఓట్లు చెల్లుబాటు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపించలేదు.. 2019లో 2.95 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఓటుని వినియోగించుకున్నారు.ఇందులో 56.545 ఓటు చెల్ల లేదట అంటే 20% ఓట్లు వృధా అయ్యాయి.


అయితే ఈసారి 4,442,218 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లను వేయడం జరిగింది. గతంలో చాలా మంది ఉద్యోగులు  రాజకీయ నాయకులకు పోస్టల్ బ్యాలెట్ ఓటుని కూడా  అమ్ముకునేవారట .దీంతో నాయకులే ఆ ఓట్లను చెల్లుబాటు అయ్యేలా పలు జాగ్రత్తలు తీసుకొని వేసేవారట. కానీ ఈసారి ఉద్యోగులు నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి మరి ఓటు వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఈదప ఉద్యోగులు తమ ఓటు తామే వేసుకోవడం వల్ల చాలా వరకు చెల్లకుండా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. మరి ఏ మేరకు ఏ పార్టీకి ఉద్యోగులు అనుకూలంగా మారారని విషయం తెలియాలి అంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.. మరి గెజిటెడ్ సంతకం లేని ఓట్లు చెల్లుతాయా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: