ఆంధ్రప్రదేశ్లో బిజెపిలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. చాలామంది బిజెపి పార్టీలో సీనియర్ నేతలుగా గుర్తింపు పొందిన వారు గతంలో యాక్టివ్గానే బిజెపిలో పలు రకాల కార్యక్రమాలలో పాల్గొంటూ పార్టీని సైతం బలోపేతం చేస్తూ ఉన్నారు.. అయితే ఇప్పుడు అలాంటి నాయకులంతా కూడా ఆంధ్రప్రదేశ్లో సైడ్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నది.. ఈసారి ఎన్నికలలో టిడిపి,జనసేన, బిజెపి పొత్తులో భాగంగా పాల్గొన్నాయి.. పొత్తు విషయంలో భాగంగా సీనియర్ నేతలు చాలామంది అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అయితే అధిష్టానం వీటినీ లెక్క చేయకపోవడంతో  పాటు దీనికి మద్దతుగా నేతలు టిడిపితో కలిసి పని చేయలేక ఎన్నికల సమయంలో చాలా తూతూ మంత్రంగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు సమాచారం. దీంతో అప్పటినుంచి వీరి వ్యవహారాల పైన బీజేపీ అధిష్టానం ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదటి నుంచి బిజెపిలో ఉంటూ RSS భావజాలంతో ఉన్న చాలామంది నేతలు సైలెంట్ గా ఉండడంతో ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ,లోక్సభ ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమంలో కాస్త ఐఇష్టంగానే పాల్గొన్నట్లు కనిపిస్తోంది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బిజెపి నేతల అలకకు ముఖ్య కారణం టిడిపితో పొత్తు పెట్టుకోవడమే అన్నట్లుగా తెలుస్తోంది.. ముఖ్యంగా పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న.. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి ,నరసింహారావు  వీరి వ్యవహారం ఇప్పుడు బిజెపిలో చాలా హాట్ టాపిక్ గా మారుతున్నది. రాజమండ్రి ప్రాంతానికి చెందిన సోమవీర్రాజు అక్కడ నుంచి ఏదో ఒక అధిష్టానం నుంచి పోటీ చేయాలి.. కానీ ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేసింది. దీంతో ఆయన సైలెంట్ గా అయ్యారు. మరో నేత విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి కూడా ఇంతే అన్నట్టుగా కదిరి నియోజకవర్గంలో కనిపించింది. అలాగే మొన్న జరిగిన ఎన్నికలలో హిందూపురం స్థానం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేయాలనుకోగా  టికెట్ దక్కకపోవడంతో ఆయన కూడా సైలెంట్ అయ్యారు. విశాఖపట్నం నుంచి పోటీ చేయాలనుకున్న జివిఎల్ నరసింహారావు కూడా ఎన్నికల విషయంలో సైలెంట్ అయ్యారు. ముఖ్యంగా ఆంధ్రాలో బిజెపి పార్టీకి ఇలాంటి క్రేజీ లేకపోవడంతో పాటు.. టిడిపి, బిజెపి, జనసేన పార్టీ కలయిక పెద్దగా నేతలకు నచ్చకపోవడం జరిగింది దీనివల్ల కూటమిలో కూడా ఎన్నో ఇబ్బందులు అల్లర్లు తలెత్తాయి.మరి వీరి మౌనానికి గల కారణం ఏంటో తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: