ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయం. చంద్రబాబు కేబినెట్‌లో చోటు ఎవరెవరికీ దక్కబోతుందనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో చోటు దక్కించుకునే టాప్ మంత్రుల జాబితా ప్రస్తుతం వైరల్‌గా మారింది. కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం కాబట్టి అందరూ అనుకున్నట్లే చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో ఆయన కుమారుడు నారా లోకేశ్‌కు కీలకమైన మంత్రి పదవి దక్కబోతుందని తెలుస్తోంది. పైగా గతంలో నారా లోకేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖలకు మంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి లోకేశ్‌కు ప్రమోషన్ దక్కడం ఖాయం అన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. కాబట్టి చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో నారా లోకేశ్ కీలక కేబినెట్ బాధ్యతలు చేపడతారని ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలుస్తోంది.


ఇక ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడుకు కూడా చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో బెర్త్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం తెలుస్తోంది. టీడీపీలో సీనియర్ మోస్ట్ నాయకుడిగా.. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా యనమల రామ కృష్ణుడు ఉన్నారు. ఇంకా అంతేకాదు ఆర్థిక శాఖ మంత్రిగా పలుమార్లు పనిచేశారు. ప్రస్తుతం కూటమి ఇచ్చిన హామీలు అమలు కావాలంటే అందుకు ఆర్థిక శాఖపై పట్టున్న నాయకుడికే మంత్రి పదవి ఇవ్వాలి. ఈ క్రమంలో ఆర్థిక శాఖను యనమల రామకృష్ణుడికి ఇప్పటికే రిజర్వ్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది. యనమల రామకృష్ణుడును మించిన ఆర్ధిక శాఖ మంత్రి టీడీపీలో ఎవరూ లేకపోవడంతో ఆర్థిక శాఖ బాధ్యతలు యనమలకే అప్పగిస్తారని సమాచారం గట్టిగా వినిపిస్తోంది.


ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోసం తన టికెట్ త్యాగం చేశారు మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ వర్మ. పవన్ కోసం తన సీటునే త్యాగం చేసిన నేపథ్యంలో వర్మకు చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో ఖచ్చితంగా చోటు కల్పిస్తారనే సమాచారం వినిపిస్తోంది. ఇప్పటికే వర్మను ఎమ్మెల్సీని చేస్తానని అంతేకాదు ఊహించని స్థానం కూడా కల్పిస్తానని చంద్రబాబు నాయుడు హామీ కూడా ఇచ్చారు. జనసేన పార్టీని గెలిపించేందుకు విశేష కృషి చేసిన వర్మకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిగా చేయడానికి టీడీపీ అధినాయకత్వం రెడీగా ఉందని ప్రచారం జరుగుతుంది.


ఇకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు కేబినెట్‌లో చోటు దక్కబోతున్నట్లు ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలుస్తోంది. అలాగే ఉత్తరాంధ్రలో మరో సీనియర్ నాయకుడు అయిన అయ్యన్నపాత్రుడుకు కూడా బెర్త్ కన్ఫర్మ్ అని సమాచారం తెలుస్తోంది. ఇలా రెండు పార్టీలలో కూడా గెలుపు పోటలు పక్కన పెట్టి మరీ మంత్రులు అయ్యే అదృష్టం వీరికే ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి చూడాలి ఈసారి టీడీపీ అధికారంలోకి వచ్చి వీరు మంత్రులు అవుతారో లేదో అనేది..!

మరింత సమాచారం తెలుసుకోండి: