దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. ఇప్పటివరకు జరిగిన ఐదు దశల పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ పార్టీ 310 స్థానాలు గెలుచుకుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. తమ విజయాన్ని ఎవరు ఆపలేరని... వస్తోంది రామరాజ్యమని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఐదు దశ లలో లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి.

మరో రెండు దశల్లో త్వరలోనే ఎన్నికలు జరగనుంది. అయితే ఆరవ దశ ఎన్నికల కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రచారం చేశారు. ఒడిశాలో ఉన్నటువంటి సంబల్పూర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ పార్లమెంట్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. ఇండియా కూటమికి 320 సీట్లు వస్తున్నాయని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 310 సీట్లను బిజెపి గెలుచుకుందని... 6 అలాగే ఏడవ దశల ఎన్నికల్లో 400 సీట్లను కూడా దాటుతామని ఆయన తెలిపారు.

అలాగే ఒడిశాలో కూడా బిజెపి తన సత్తాను చాటుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఒడిస్సా రాష్ట్రంలో కొద్దిమంది చేతుల్లో అధికార పగ్గాలు ఉన్నాయని ఆయన ఆరోపణలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఒడిస్సాలో కూడా బిజెపిని ప్రజలు ఆదరించాలని కోరారు. దీంతో.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అమిత్ షా ఇంత ధీమాగా చెప్పడానికి ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రామ మందిరం కట్టిన ఘనత బిజెపి తమ ఖాతాలో వేసుకుంది. దీంతో ఉత్తర భారత దేశంలో బిజెపికి భారీ సీట్లు వస్తాయని సర్వేలు కూడా చెబుతున్నాయి.

అలాగే బలమైన నాయకత్వం బిజెపి సొంతం. క్రమశిక్షణతో అలాగే నిబద్ధతతో 10 సంవత్సరాలుగా దేశాన్ని మోడీ సర్కార్ ఏలింది. ఆర్థిక పరిస్థితి ఎలాగ ఉన్నా... పటిష్టమైన నాయకత్వాన్ని మోడీ ప్రభుత్వం కనబరిచింది. అయితే కాంగ్రెస్ ఆ విషయంలో దారుణంగా విఫలమైంది. ఇప్పటికీ ప్రధాని అభ్యర్థి ఎవరో సరిగ్గా చెప్పలేని పరిస్థితిల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేయడం కూడా కాంగ్రెస్కు మైనస్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. హిందూ ఓటర్లను చీల్చడంలో బిజెపి సక్సెస్ అయింది. దీంతో గంపగుత్తగా హిందూ ఓటర్లు బిజెపి పార్టీకి ఓటు వేస్తున్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా అదే జరుగుతోంది. ప్రచారాన్ని కూడా... చాలా పటిష్టంగా బిజెపి పార్టీ ముందుకు తీసుకువెళ్తోంది. ఈ ధీమాలతోనే అమిత్ షా అలాగే బిజెపి అగ్రనేతలు అందరూ 400 సీట్లు ఖాయమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp