మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయ పార్టీ నేతల మధ్య రక్తసంబంధం పెను మార్పులకు దారి తీసేలా కనిపిస్తోంది. రాజకీయాల్లో ప్రత్యర్ధులుగా ఉన్న నాయకులు... రక్తసంబంధం నేపథ్యంలో ఒక్కటవుతున్నారట. అన్నం పెట్టిన పార్టీని కాదని... ప్రత్యర్ధులకు పని చేస్తున్నారట. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఇలాంటి రాజకీయాలే నెలకొన్నాయి. మహబూబ్నగర్ ఎంపీగా డీకే అరుణమ్మను గెలిపించేందుకు... ప్రత్యర్థి పార్టీలో ఉన్న రక్తసంబందపు నేతలు సహాయం చేశారట.

ఇప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. మహబూబ్నగర్ ఎంపీగా బిజెపి తరఫున డీకే అరుణ పోటీ చేశారు. అటు గులాబీ పార్టీ తరఫున మన్నె శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున వంశీధర్ రెడ్డి పోటీ చేశారు. అయితే... ఈ ముగ్గురు అభ్యర్థుల్లో డీకే అరుణ చాలా బలమైన లీడర్. దేశంలో బిజెపి వేవ్ ఉన్న నేపథ్యంలో... ఆమె విజయం చాలా సులువు అని అందరు అంటున్నారు.

అంతేకాకుండా మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూడా డీకే అరుణ్ అమ్మకు చాలా హెల్ప్ చేశారట. డీకే అరుణ సోదరిని కూతురే పర్ణిక రెడ్డి. అంటే డీకే అరుణకు స్వయానా మేనకోడలు. దీంతో ఆమె క్యాడర్ మొత్తం బిజెపికి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. ఇటు తన సోదరి అయిన డీకే అరుణను గెలిపించేందుకు చిట్టెం రామ్మోహన్ రెడ్డి చాలా కష్టపడ్డారట.

కానీ ఈ ఇద్దరు లీడర్లు పైకి మాత్రం డీకే అరుణకు ఎలాంటి సహాయం చేయలేదని చెబుతున్నారు. అటు డీకే అరుణ కూడా... మోడీ నాయకత్వంలో... ఆయన పాలన చూసి బిజెపికి ఓటు వేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ రక్తసంబంధం డీకే అరుణకు కలిసి వచ్చిందని చెబుతున్నారు. దీంతో లక్ష మెజారిటీతో అరుణ విజయం సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: