ఆంధ్రప్రదేశ్లోని నెట్వర్క్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ నిధులు పెండింగ్ ఉన్నాయని.. తక్షణమే మార్చి 31 వరకు పెండింగ్ ఉన్న నిధులను విడుదల చేస్తేనే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు సైతం చాలా స్పష్టం చేశాయి. అయితే దీనిపైన ఏపీ ప్రభుత్వం 203 కోట్ల రూపాయలను విడుదల చేయగా తక్షణమే 800 కోట్లు విడుదల చేయాలని పట్టు పడడం జరిగింది.. దీంతో రెండో దశ కూడా చర్చ విఫలమైనట్లుగా తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ అమలు చేయకుంటే తక్షణమే 800 కోట్లు విడుదల చేయాలని 1500 కోట్ల బకాయిలో 800 కోట్లు చెల్లిస్తే ఖచ్చితంగా సేవలు అందిస్తామంటూ నెట్వర్క్ ఆసుపత్రులు స్పష్టం చేశాయి.


అయితే ప్రభుత్వం రిలీజ్ చేసిన 203 కోట్ల రూపాయల్లో కనీసం ఒక నెల బిల్లు కూడా కాదని అసంతృప్తితో నెట్వర్క్ ఆసుపత్రిలు ఉన్నాయి. ఏపీలోని నెట్వర్క్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నేటి నుంచి ప్రైవేటు ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ నిలిపివేసినట్లుగా తెలియజేశారు. 1500 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ నిధులు పెండింగ్లో ఉన్నాయని ఈ బిల్లులు చెల్లించే వరకు కొత్త కేసులను అసలు తీసుకోమని కూడా ప్రకటించాయి.. దీంతో ఆరోగ్యశ్రీ సీఈవో నెట్వర్క్ ఆసుపత్రులపైన నిన్నటి రోజు ఈ రోజున చర్చలు జరపగా అవి విఫలమయ్యాయి.


ఇలా రెండు దఫాలుగా చర్చలు విఫలం కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందనే విషయం పైన ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఆరోగ్యశ్రీ నిలిచి వేయడంతో రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే కొత్త కేసులను కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చుకోకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్న సమయంలోనే ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సైతం ఒక కీలకమైన ప్రకటనను జారీ చేసింది.. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఎవరైనా అంతరాయం కలిగిస్తే ఖచ్చితంగా ఆ ఆసుపత్రుల పైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించింది. ఆరోగ్యశ్రీకి బ్రేకులు పడకుండా చూడాలంటూ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులను జారీ చేసింది.. 2023 ,24 లో ఆరోగ్యశ్రీ ట్రస్టు కు 3,566,22 కోట్ల రూపాయలు నెట్వర్క్ ఆసుపత్రులకు విడుదల చేసామంటూ ట్రస్ట్ ప్రకటించింది. అలాగే గతంలో చెప్పిన లాగానే 203 కోట్ల రూపాయలు  విడుదల చేశామని..2024-25 కు 366 కోట్లు విడుదల చేశామంటూ కూడా తెలియజేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: