ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఓటింగ్ ఈనెల 13న పూర్తి అయ్యింది. ఓటింగ్ లెక్క మాత్రం జూన్ 4వ తేదీన చేయబోతున్నారు.. గతంలో ప్రజలు ఓటింగ్ కోసం చాలా  ఆత్రుతగా ఎదురు చేసేవారు. ఎందుకంటే వారి అభిమాన నాయకులు గెలుపు వారికి ఉండే అభిమానం ఆ విధంగా చేస్తూ ఉండేది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆంధ్రాలో మాత్రం కౌంటింగ్ అంటేనే నాయకుల మాట ఎలా ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం చాలా భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఏపీలో గతంలో ఎన్నడు లేని విధంగా అత్యంత ఉత్కంఠంగా ఈసారి ఎన్నికలు జరిగాయి


ముఖ్యంగా సవాళ్లు ప్రతి సవాళ్లు స్థానంలో విమర్శలు గొడవలు ఇతరత్రా వంటివి చోటు చేసుకుంటున్నాయి.. ముఖ్యంగా రాళ్లు విసిడిపోవడం ,పెట్రోల్ బాంబులు వంటివి కూడా చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాము.. ఎన్నికల ముందు వరకు ఏ పార్టీ కూడా తక్కువ ఒక ప్రచారం అయితే చేయలేదు. ముఖ్యంగా ఎన్నికల రోజున అనంతరం మూడు రోజులపాటు చాలా జిల్లాలలో విధ్వంసాలు కూడా సృష్టించాయి. చాలామంది కార్యకర్తల పైన కేసులు కూడా నమోదు అయినట్టుగా తెలుస్తోంది. కొందరైతే ఇప్పటికే అరెస్టయ్యారు.


మొత్తంగా చూస్తే ఎన్నికల తర్వాత చెలరేగే హింసకు నాయకులు కూడా భయపడే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు తాజాగా కౌంటింగ్ రోజున ఎలాంటి విధ్వంసాలు జరుగుతాయని విషయం పైన కేంద్ర ప్రభుత్వం ఇంటిలిజెన్స్ వర్గాలు చెప్పడంతో మరింత జాగ్రత్తగా ఉండమని ప్రజలను కూడా హెచ్చరిస్తున్నారు. వీరు ఇచ్చిన నివేదిక ప్రకారం ఓటింగ్ రోజు రాష్ట్రంలో 30 నుంచి 42 నియోజకవర్గాలలో అల్లర్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అలాగే హత్యలు జరిగిన కూడా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయట. దీంతో రాష్ట్రంలో కౌంటింగ్ కి ముందు రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో కౌంటింగ్ రోజున ఏమైనా జరగవచ్చని ప్రజలు కూడా భయభ్రాంతులకి గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: