తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తేదీన 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కాబోతున్నాయ్. అయితే ఈ ఫలితాలలో ప్రజలు ఎవరి భవితవ్యాన్ని ఎలా తేల్చారు అన్న విషయం పై క్లారిటీ రాబోతుంది అని చెప్పాలి. అయితే జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా.. అంతకుముందే ఇక ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లలో ఉన్న రాజకీయ సమీకరణాల దృశ్యం ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై అటు రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఒక అంచనాకు వస్తున్నారు. అంతేకాకుండా తప్పకుండా గెలిచే నేతలు ఎవరు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది.. ఆ వివరాలు చూసుకుంటే..

 కిషన్ రెడ్డి : సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీగా కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతున్న కిషన్ రెడ్డి ఇక మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టుబోతున్నాడట. అయితే ఇప్పటికే రెండుసార్లు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న.. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాత్రం కిషన్ రెడ్డి విజయం సాధిస్తూ వచ్చారు  ఇక్కడ బిఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు  కిషన్ రెడ్డి అటు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడటం.. కేంద్ర మంత్రిగా పలు పరిశ్రమలను కూడా తీసుకురావడంతో మరోసారి ప్రజలు కిషన్ రెడ్డికి పట్టం కట్టబోతున్నారట.


 బండి సంజయ్ : ఉద్యమాల పురిటి గడ్డ.. తెలంగాణ పోరాటానికి ఆజ్యం పోసిన అడ్డ.. రాజకీయ చైతన్యానికి నిలువెత్తు రూపం అయినా కరీంనగర్లో బండి సంజయ్ మరోసారి ఎంపిగా విజయం సాధించబోతున్నారని విశ్లేషకులు  చెబుతున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 19 సార్లు ఎన్నికలు జరుగగా.. 9 సార్లు కాంగ్రెస్, ఉప ఎన్నికతో  కలిపి నాలుగు సార్లు బిఆర్ఎస్, మూడు సార్లు బిజెపి, ఒకసారి టిడిపి, మరోసారి తెలంగాణ ప్రజా సమితి గెలిచాయి. అయితే 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ లో బిజెపి నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బిఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే వెలిశాల జగపతిరావు తనయుడు రాజేందర్ రావ్ బరిలో ఉన్నారు. ఇక రాజకీయ సమీకరణాలు చూసుకుంటే అటు బండి సంజయ్ విజయం ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు.


 ధర్మపురి అరవింద్ : అనూహ్యమైన   రాజకీయ ఫలితాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉండే నిజాంబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇక వరుసగా రెండోసారి ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలవబోతున్నారు అని విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడ బిజెపి నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి.. బిఆర్ఎస్ నుండి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్  బరిలో నిలిచారు.   అయితే ధర్మపురి అరవింద్ ఇప్పటికే పసుపు బోర్డు హామీని దాదాపుగా నెరవేర్చుకోవడం.. ఇక ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ నీ తెరిపిస్తానంటూ  హామీ ఇవ్వడంతో ప్రజలు మరోసారి ఆయనకే పట్టం కట్టబోతున్నారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: