ఆంధ్రప్రదేశ్ లోని కీలకమైన నియోజకవర్గాల్లో గుడివాడ కూడా ఒకటి. ఈ నియోజకవర్గ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది కొడాలి నాని. ఈయనకు గుడివాడ కంచుకోటలా మారింది. ఇప్పటికే డబల్ హ్యాట్రిక్ కొట్టిన కొడాలి నానిని ఈసారి ఎలాగైనా ఓడించాలని టిడిపి కంకణం కట్టుకుంది. దీంతో ఆయనకు ప్రత్యర్థిగా ఎన్నారై వెనిగండ్ల రామును బరిలో దింపింది. మరి రాము నానిని ఎదుర్కోగలడా. ఈ ఇద్దరు ప్రత్యర్థుల మధ్య గెలుపు ఎవరిది.? ఎవరి బలబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
కొడాలి నాని ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు గెలుపొందారు. నాని అంటేనే తూటా లాంటి మాటలు, ప్రత్యర్థులను తన మాటలతో ఇట్టే పడగొట్టేస్తారు. అలాంటి నానిని ఈసారి ఎలాగైనా పడగొట్టాలని టిడిపి పక్కా ప్లానింగ్ చేసింది. దీనిలో భాగంగానే ఆర్థిక, కుల సమీకరణాలు లెక్కలేసుకొని రాముని బరిలోకి దించింది. ఇదే తరుణంలో గుడివాడలో ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికల్లో 79 శాతం అయితే ఈ ఎన్నికల్లో 82.51 శాతం అయింది.


 అయితే ఈ సారి పురుషుల కంటే, మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి ఓట్ల శాతం పెరగడం  మాకే కలిసి వస్తుందని వైసిపి, లేదు మహిళలు ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే మాకు ఓటేశారని టిడిపి ఎవరి అంచనాలకు వారు వస్తున్నారు. ఈ విధంగా గుడివాడలో ఓవైపు నాని మరోవైపు రాము ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్లారు. నాని మాత్రం ఇదే నా చివరి ఎన్నిక అనే సెంటిమెంట్ రాజేశారు. ఇప్పటికే నాలుగు సార్లు గెలిచినటువంటి కొడాలి నాని,  నాలుగు సార్లు తనపై కొత్త అభ్యర్థులే పోటీ చేశారు. వారు వచ్చి నియోజకవర్గంలో పూర్తిగా తెలుసుకునే లోపు నాని ప్రచారాన్ని పూర్తి చేసేవారు.  ఇదే తరుణంలో మంచి ఆలోచనకు వచ్చిన టిడిపి రెండు సంవత్సరాల క్రితమే వెనిగండ్ల రామును బరిలోకి దించింది. దీంతో రాము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ టిడిపి నాయకులతో కలిసి పనులు చేసుకుంటూ వచ్చారు. అంతేకాకుండా  తన పని తానేదో చేసుకుంటూ పేద ప్రజలకు అండగా నిలిచారు.

అలాగే ఆయన మంత్రి అయిన నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లారు. కానీ నాని మాత్రం సంక్షేమ పథకాలు, జగన్ అనే బ్రాండ్ నన్ను గెలిపిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. అంతేకాకుండా నాని లోకల్ వ్యక్తి కావడం మరింత కలిసి వచ్చే అంశం.  ఇక రాము విషయానికొస్తే ఆయన వెనిగండ్ల ట్రస్ట్ పేరుతో అనే కార్యక్రమాలు చేశారు.  కానీ ఆయన లోకల్ కాదు అనేది ఒక అంశం ప్రజల్లో ఉంది.  ఆయన గెలిచిన ఓడిన తర్వాత ఇతర దేశాలకు వెళ్లిపోతారని   విపరీతంగా  న్యూస్ చక్కర్లు కొట్టింది. ఏది ఏమైనా కొడాలి నాని లోకల్ లో ఉంటాడు మనకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడనే ఆలోచనతో  ప్రజలు ప్రతిసారి నానీకి పట్టం కడుతూ వచ్చారు.. అయితే ఈసారి కూడా  గుడివాడలో నాని  గెలుస్తారని నమ్మకంతో  ఉన్నారట. మరి ఎవరి భవితవ్యం ఎలా ఉంటుందో బయటపడాలి అంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: