ఆంధ్రప్రదేశ్ లో టిడిపి అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు  ఉన్నారు.. ఆంధ్రప్రదేశ్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. బాబు లేకపోతే చినబాబు ఉంటారనేంతలా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇద్దరు అధినేతలు సైతం విదేశాలకు వెళ్లినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో కీ రోల్ ప్లే చేయాల్సిన అచ్చెన్నాయుడు అని అందరూ అనుకుంటున్నారు. అయితే మాజీ మంత్రులు టిడిపి సీనియర్ నేతల హడావిడి పెద్దగా చేస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు.. ముఖ్యంగా ఈసీ కి ఫిర్యాదులు చేయడం డీజీపీలకు లేఖలు రాయడం ప్రెస్ మిట్లు వంటివి పెట్టడం చేస్తూ ఉన్నారు. అయితే ఇదంతా టిడిపి నేతలు మాత్రమే చేస్తున్నారు.


అచ్చెన్నాయుడు పోలింగ్ తర్వాత సైలెంట్ అయిపోయారని ఆయన తన పని తాను అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి అధినాయకత్వం లేనప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీకి పెద్ద దిక్కుగా  ఉండే అచ్చెన్నాయుడు అన్నది వాస్తవమే.. అయితే ఆచరణకు వచ్చేసరికి మాత్రం చాలా మంది నేతలు ఎక్కువగా ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా వారే హై కమాండ్ అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. పార్టీలో చాలామంది కొత్తగా చేరిన నేతలే ఎక్కువగా మాట్లాడుతున్నారని టాక్ వినిపిస్తోంది.


చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు కూడా ఇలాగే చాలా మంది నాయకులు వచ్చి హడావిడి చేయడం జరిగింది అప్పుడు కూడా అచ్చెన్నాయుడు పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేనట్లు తెలుస్తోంది. ఒక రాజకీయ పార్టీ అన్నాక అధ్యక్షుడు కీలకంగా ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ టీడీపీలో మాత్రం ఎవరికి వారే లీడర్లు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు.. చంద్రబాబుని చినబాబు ని తప్పించి వేరే ఎవరిని కూడా వీరు పట్టించుకునే రకాలు కాదని వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకే ఏపీలో టీడీపీ అధ్యక్ష పదవి అంటే ఎవరు పట్టించుకోవడంలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇకనైనా అచ్చెన్నాయుడు అన్ని విషయాల పైన స్పందిస్తారో లేదో చూడాలి మరి. మరి ఏం జరుగుతుందో చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: