ఏ రాష్ట్రం అయినా అభివృద్ధి చెందాలి అంటే ఆ రాష్ట్రంలో ఉన్న నాయకులు , ముఖ్యమంత్రి తో పాటు ఆ రాష్ట్రంలో పని చేసే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కీలక పాత్రను పోషిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ముఖ్యమంత్రి దగ్గర ఎంతోమంది ఐఏఎస్ , ఐపీఎస్ ఆఫీసర్స్ ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉంటారు. వారిలో చాలా మంది రాష్ట్ర ప్రగతి కోసం , రాష్ట్రం ముందుకు వెళ్లడం కోసం , రాష్ట్రంలోని అనేక విషయాలలో ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండటం కోసం వారు అనేక ప్రణాళికలను ముఖ్యమంత్రులకు సూచిస్తూ ఉంటారు.

అలా సూచించిన వాటిలో కొన్ని అద్భుతమైన విజయాలను సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా నిలుస్తాయి. ఒక రాష్ట్రంలో మంచి సక్సెస్ అయిన పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొంత మంది జగన్మోహన్ రెడ్డి హయాంలో మంచి గుర్తింపును పొందిన ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. వారిలో ఎస్ సురేష్ కుమార్ ఒకరు. ఈయన ఆంధ్రప్రదేశ్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా పని చేశారు.

ఇక ఈయన జగన్మోహన్ రెడ్డి టైమ్ పీరియడ్ లో స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టం డెవలప్ కావడంలో అత్యంత కీలక పాత్రను పోషించాడు. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్నిటిలోను అద్భుతమైన టెక్నాలజీతో వసతులతో బోధన ఉండాలి అనే ఉద్దేశంతో నాడు నేడు అనే ప్రోగ్రామ్ ను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అయ్యింది. రాష్ట్రంలోని ఎన్నో స్కూల్స్ ను ఇప్పటికే చాలా పునరుద్ధరించారు.

ఇక ఈ కార్యక్రమంలో సురేష్ కుమార్ కూడా అత్యంత కీలక పాత్రను పోషించాడు. ఇప్పటికే ఈ పథకం సూపర్ సక్సెస్ కావడంతో ఒక వేళ రాబోయే ఎన్నికల రిజల్ట్ లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మరొకసారి కనుక వచ్చినట్లు అయితే నాడు నేడు ప్రోగ్రాం మరింత విస్తృతంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా మిగిలి ఉన్న కొన్ని స్కూల్స్ ను కూడా మరింత పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయి. ఇలా నాడు నేడు ప్రోగ్రాం సూపర్ సక్సెస్ కావడంలో సురేష్ కుమార్ కూడా అత్యంత కీలకపాత్రను పోషించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap