ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన కూడా ఎన్నికల హడావిడి కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే   పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి  ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా ఇక పావులు కదపడంలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలలో పార్లమెంటు ఎన్నికలతో పాటుగానే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉండడంతో   ఇక రాజకీయ వేడి మరింత వాడి వేడిగా మారిపోయింది.


 అయితే ఎన్నికలు ఏవైనా సరే అటు  నేటి రోజుల్లో ఈవీఎం వివి ప్యాడ్లను ఉపయోగిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. వీటి ద్వారానే అధునాతన టెక్నాలజీతో ప్రజలు వేసిన ఓట్లను ఎంతో భద్రంగా ఉంచగలుగుతున్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి ఎన్నికల హడావిడి నెలకొన్న నేపథ్యంలో.. ఈవీఎం వివి ప్యాడ్ లకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయ్. అయితే ఈవీఎం యంత్రాలు ఎక్కడ తయారవుతాయి అన్న విషయం చాలామందికి తెలియదు.


 అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో 90% హైదరాబాదులోనే తయారవుతాయట. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్ లో ఈవీఎంలను రూపొందిస్తూ ఉంటారట. 543 ఎంపీ స్థానాలలో దాదాపు 500 చోట్ల ఇలా ఈసీఐఎల్ లో తయారుచేసిన ఈవీఎంలనే వాడుతున్నారు అన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే రెండు నెలల కిందటే 6.25 లక్షలకు పైగా కంట్రోల్ యూనిట్లు, 8.39 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 5.4 లక్షల వివి ప్యాడ్ లను ఇక ఈసీకి పంపిణీ చేసినట్లు ఈసీఐఎల్ అధికారులు తెలిపారు.కాగా దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: