దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు విడతల్లో పార్లమెంట్ ఎన్నికలు ముగి సాయి. మరో రెండు విడతల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంది. శనివారం రోజున ఉత్తరప్రదేశ్ లాంటి ప్రధాన ప్రాంతాలలో ఆరవ విడత పార్లమెంటు ఎన్నికలు జరుగునున్నాయి. ఇక ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి చాలాచోట్ల విజయం సాధిస్తున్నాయి సర్వేలు చెబుతున్నాయి.

కానీ బిజెపి పార్టీ తరఫున పోటీ చేస్తున్న మేనకా గాంధీ గెలవడం కష్టమని అంటున్నారు. అయితే దీనంతటికీ కారణం బిజెపి పార్టీ... మేనక గాంధీకి సపోర్ట్ చేయకపోవడం అని చెబుతున్నారు. మేనక గాంధీ కొడుకు వరుణ్ గాంధీ... మొన్నటి వరకు ప్రధాని మోడీ కి వ్యతిరేకంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట. అలాగే బిజెపి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాకుండా వరుణ్ గాంధీ, మేనక గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని మొన్నటి వరకు ప్రచారం జరగగా... సోనియాగాంధీ ఈ అంశాన్ని చిరస్కరించారట. దీంతో వారు ప్రస్తుతం బిజెపి పార్టీలోనే ఉన్నారు. మేనక గాంధీ... యూపీలోని సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీ బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి మేనక గాంధీ చాలా అవలీలగా విజయం సాధించారు. డి.ఎస్.పి అభ్యర్థిపై మేనక గాంధీ 2019లో విజయం సాధించారు.

అయితే ఈసారి బిఎస్పి పార్టీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారట బిజెపి ఎంపీ అభ్యర్థి మేనక గాంధీ. అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారం చేసిన నరేంద్ర మోడీ... వరుణ్ గాంధీ కారణంగా... మేనక గాంధీ నియోజకవర్గం లో ప్రచారం చేయలేదట. దీంతో మేనక గాంధీ ఈసారి గెలవడం కష్టమైనా అని అందరూ భావిస్తున్నారు. అక్కడ బీఎస్పీ పార్టీకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయని టాక్. మరి ఇలాంటి గడ్డు పరిస్థితులను మేనక గాంధీ కుటుంబం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: