ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల లో తనదైన మార్క్ పాలన కొనసాగించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేని చాలా సంచలన నిర్ణయాలు కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొని సక్సెస్ అయ్యారు. ఎమ్మెల్యేలను, ఇటు మంత్రులను హ్యాండిల్ చేస్తూనే... అధికార యంత్రాంగాన్ని కూడా... చాలా చక్కగా వినియోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఏ అధికారి ఉండాలి... ఎక్కడ మంత్రి పనిచేయాలి? అనే విషయాలను జగన్మోహన్ రెడ్డి సరిగ్గా అమలు చేయగలిగారు.

ఇక సలహాదారుల నియామకం, అధికారుల బదిలీలు, జనాల్లో ప్రభుత్వంపై నమ్మకం పెంచేలా అడుగులు వేశారు. ఈ నేపథ్యంలోనే గౌతమ్ సవాంగ్ సేవలను చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి వినియోగించుకున్నారని చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో మొత్తం గౌతమ్ సవాఓగ్ ముఖచిత్రమే కనిపిస్తుంది. 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఐపీఎస్ అధికారి అయిన గౌతం సవాంగును... ఏపీ డీజీపీగా నియామకం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి.

అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ ఫైల్ పైన పెట్టారు జగన్. అప్పటివరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా గౌతమ్ పనిచేసిన సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిపిగా అనౌన్స్ చేసేశారు. 2086 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి గౌతమ్... చిత్తూరు జిల్లాలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంటే ఈ ఏరియా మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రాంతం కావడం విశేషం. అప్పటినుంచి జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితులుగా ఉన్నారట గౌతమ్ సవాంగ్.

ఏఎస్పీగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన గౌతమ్ సవాంగ్... డిజిపి స్థాయికి ఎదిగారు. ఇక 2019 నుంచి 2022 వరకు మాత్రమే ఆయన డిజిపిగా పని చేయగలిగారు. తాను పదవిలో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రభుత్వానికి కష్టపడి ఎన్నో సేవలు అందించారు. ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి చిక్కులు లేకుండా... శాంతి భద్రతలను కూడా పరిరక్షించారు. కొన్ని అడప దడప వివాదాలు మినహా... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంచి మంచి మార్కులు వచ్చేలా లాండ్ ఆర్డర్ మైంటైన్ చేశారు గౌతమ్ సవాంగ్.

అయితే... ఆ తర్వాత డిజిపి నుంచి ఆయనను తప్పించి వెంటనే ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి అప్పగించారు జగన్. ఆయన కేంద్ర సర్వీస్ లకు వెళ్లకుండా... తన దగ్గరే ఉండేలా జగన్మోహన్ రెడ్డి ఈ స్కెచ్ వేశారు. ఇక ఏపీపీఎస్సీ చైర్మన్ గా కూడా తన వంతు పాత్రను కష్టపడి చేస్తున్నారు గౌతమ్ సవాంగ్. ఇలా అడుగడుగునా... అణువణువునా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో గౌతమ్ సవాంగ్ ముఖచిత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: