వరంగల్ జిల్లాలో బలమైన నేతల్లో కడియం శ్రీహరి కూడా ఒకరు ఆయన ఏ పార్టీలో ఉన్న అధిష్టానం దృష్టిని తనపై పడేలా చేసుకుంటారు. అలాంటి కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీని వీడి తన కూతురి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ టికెట్ కూడా తెచ్చుకున్నారు. అలాంటి కడియం శ్రీహరి రాబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కోసం కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం ఓరుగల్లులో ఎక్కడ చూసినా ఈ టాపిక్ గురించే మాట్లాడుతున్నారు. అలాంటి కడియంకు అక్కడ మంత్రి పదవి దక్కుతుందా.? ఒకవేళ ఆయనకు మంత్రి పదవి వస్తే అక్కడ మహిళా మంత్రుల్లో ఏ మంత్రికి చెక్ పడుతుంది.. 

లేదంటే ముగ్గురు మంత్రులని ఉమ్మడి వరంగల్ జిల్లా కేటాయిస్తారా అనేది తెలుసుకుందాం.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం  నుంచి తన రాజకీయాన్ని ప్రారంభించిన కడియం చంద్రబాబు కేబినెట్ లో కూడా మంత్రి పదవులు పొందారు. ఇక చివరికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ చెంతన చేరి అక్కడ కూడా మంత్రి పదవులు పొంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి కడియం శ్రీహరి పేరు ప్రస్తుతం వరంగల్ జిల్లాలోనే చర్చనియంశంగా మారింది. ప్రస్తుతం జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో ఆయన తప్పకుండా ఉంటారని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన మాదిగ సామాజిక వర్గం నుంచి బలమైన నేతగా ఉన్నారు. అంతేకాదు జిల్లాలో  ఎర్రబెల్లి దయాకర్ ను ఎదుర్కొనే దీటైనా లీడర్. ఇలా అన్ని సమీకరణాలు పరిశీలిస్తే మాత్రం కడియంకు మంత్రి పదవి ఇవ్వడం సబబే అనిపిస్తోందట.

 అంతే కాదు కడియం శ్రీహరి పార్టీలో చేరే ముందు కూడా అనేక డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తోంది అవన్నీ ఒప్పుకున్న తర్వాతే కాంగ్రెస్ లో చేరారట. కట్ చేస్తే వరంగల్ జిల్లాలో ప్రస్తుతం ఇద్దరు మహిళ నేతలు మంత్రులుగా ఉన్నారు. వారిలో ఒకరు సీతక్కైతే మరొకరు, కొండా సురేఖ. వీరిద్దరూ బీసీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతలే. దీంతో మరో వ్యక్తికి ఉమ్మడి జిల్లా నుంచి అవకాశం దక్కుతుందని అభిప్రాయం ఉంది. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు మాదిగ సామాజిక వర్గ నేతకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఈ పదవి కడియంకి ఇవ్వాలని రేవంత్ అనుకుంటున్నారట.  ఒకవేళ అధిష్టానం ఒప్పుకోకపోతే  ప్రస్తుతమున్న మహిళా మంత్రుల్లో ఒక మంత్రిని పక్కనపెట్టి మరీ కడియంకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచన రేవంత్ చేస్తున్నట్టు తెలుస్తోంది. లేదంటే అధిష్టానాన్ని ఒప్పించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండేలా ఆయన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: