దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఇప్పటికే పలు విడుదల పోలింగ్ అయిపోయింది. జూన్ 1 అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగియనుంది. ఇదే తరుణంలో జూన్ 4న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో పోలింగ్ రిజల్ట్ బయటకు వస్తోంది. ఆరోజునే ఎవరి భవితవ్యం ఏంటి అనేది తప్పక తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గంల్లో ఎవరు గెలుస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. మరి ఆ వివరాలు చూద్దామా.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదే తరుణంలో పార్లమెంటు ఎలక్షన్స్ కూడా మే 13వ తేదీన  ముగిశాయి.ఈ క్రమంలోనే ఈ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుస్తుందనేది  చాలా ఆసక్తికరంగా మారింది. మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ హోరహోరి పోటీ చేశాయి. ఈ క్రమంలోనే  ఏ పార్టీ గెలుస్తుంది అనేది చాలా కీలకంగా మారింది. రాష్ట్రంలో అసెంబ్లీ వరకైతే ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.

 కానీ పార్లమెంటు ఎలక్షన్స్ లో మాత్రం ఆ విధమైన రిజల్ట్ ఉండకపోవచ్చు. ఈ సందర్భంలోనే బిజెపి మాత్రం మేము తెలంగాణలో అత్యధిక స్థానాలు సాధిస్తామని, బాహాటంగానే చెబుతున్నారు. ఇదే తరుణంలో  కాంగ్రెస్ పార్టీకి కూడా పార్లమెంట్ లో విజయకేతనం మాదే అంటూ చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అటు ఇటుగా మాదే విజయం అని చెబుతోంది. మరికొన్ని సర్వే సంస్థలు  కాంగ్రెస్, బిజెపి మధ్య పోటీ ఉందని చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక సంచలన సర్వే బయటకు వచ్చింది. ఇందులో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధిస్తుందని తెలియజేస్తున్నారు.

 జన్మత్ పోల్స్ పేరుతో పేరుతో వచ్చినటువంటి ఈ సర్వేలో మొత్తం 17 స్థానాలకు గాను  కాంగ్రెస్ పార్టీ 11 నుంచి 12 స్థానాలు గెలుస్తుందని, బిజెపి 4నుంచి 5స్థానాల్లో వస్తుందని,  బీఆర్ఎస్ 01 స్థానంలో గెలుస్తుందని తెలియజేస్తున్నారు. మరి చూడాలి  ఈ సర్వే సంస్థ చెప్పిన  ఎగ్జిట్ పోల్ నిజమవుతుందా  లేదంటే మరో రకమైన రిజల్ట్ వస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: