ఎప్పుడు అయితే ఎలక్షన్ల షెడ్యూల్ విడుదల అవుతుందో అప్పటి నుండి రాజకీయ నాయకులతో పాటు సర్వేలు చేసే వారు కూడా అలర్ట్ అవుతూ ఉంటారు. వారు కూడా చాలా మంది సిబ్బందితో ఊరూరు తిరిగి ఏ పార్టీకి ఆ ప్రాంతంలో ఎలాంటి పట్టు ఉంది. అక్కడ ఏ సామాజిక వర్గం బలంగా ఉంది. ఏ కాండిడేట్లను పార్టీలు నిలబెట్టాయి. ఆ పార్టీ నిలబెట్టిన వ్యక్తులకు ఎంత స్థాయిలో క్రేజీ ఉంది. ఇలా అనేక విషయాలపై సర్వేలను నిర్వహిస్తూ సర్వే సంస్థలు నివేదికలను విడుదల చేస్తూ ఉంటాయి.

అలా విడుదల చేసిన నివేదికలలో ఎవరి నివేదిక అయితే సక్సెస్ ఫుల్ అవుతూ ఉంటుందో వారి నివేదికలను ఎక్కువగా జనాలు ఫాలో అవుతూ ఉంటారు. ఇకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే అనేక ఎలక్షన్ లు జరిగాయి. అందులో భాగంగా అనేక మంది ఎలక్షన్ లపై సర్వే రిపోర్ట్ లను కూడా ఇచ్చారు. అందులో చాలా సక్సెస్ అయిన సర్వే ఆరా మస్తాన్ సర్వే. ఈయన గతంలో ఆంధ్ర ఎలక్షన్ లకి సంబంధించి అనేక సర్వేలను నిర్వహించగా దానిలో చాలా వరకు సక్సెస్ అయ్యాయి.

దానితో 2023 ఎలక్షన్ లలో ఆరా మస్తాన్ ఎలాంటి సర్వే రిపోర్ట్ ఇవ్వబోతున్నాడు అని చాలా మంది ఎదురు చూశారు. ఇకపోతే ఈయన ఒకానొక సందర్భంలో ఒక మాట చెప్పారు. దాని ప్రకారం కూటమిదే విజయం అని చెప్పవచ్చు. ఆయన మే 13 ఎలక్షన్ల రోజు ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ లలో లైవ్ లో ఉన్న సందర్భంలో అప్పటికి ఓటింగ్ పూర్తి కాలేదు.

ఓటింగ్ ఎంత శాతం జరిగింది అనేది ఎవరికి తెలియదు. అలాంటి సమయంలో ఈయన ఎన్నికలలో పోయిన సారి కంటే ఈ సారి కనుక ఎక్కువ శాతం ఓటింగ్ జరిగితే అది కూటమికి అనుకూలం. ఇక ఈసారి పోయిన సారి కంటే ఎక్కువ ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఈయన సర్వే ప్రకారం కూటమి అధికారం లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

am