తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే తెలంగాణ రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకాల పైన నిషేధం వేధిస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ముఖ్యంగా పొగాకు, నికోటిన్ కలిగిన ఉత్పత్తులను సైతం ఎవరైనా ప్యాక్ చేసి అమ్మిన గుట్కా పాన్ మసాలా వంటి వాటిని అమ్మినా కూడా చట్టరీత్యాన్ చర్యలు తీసుకుంటామంటూ వెల్లడించారు.. ఈ ఉత్పత్తుల నిల్వగానే పంపిణీ కానీ రవాణా పైన కూడా నిషేధం ఉన్నట్లుగా తెలియజేశారు.


గుట్కా పాన్ పరాక్ ఇతరత్రా వాటిలను కూడా ఈనెల 24వ తేదీ నుంచి బ్యాన్ చేస్తున్నట్లు తెలియజేశారు తెలంగాణ ప్రభుత్వం. ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2006 లో సెక్షన్ 30 లోని సబ్ సెక్షన్ 2 కింద వీటిని బ్యాన్ చేస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్లను జారీ చేసింది.. 2011 ప్రకారం ప్రజా ఆరోగ్య పరిరక్షణ దృష్ట కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను కూడా తెలంగాణలో అన్ని పోలీస్ కమిషనరేట్ ల వద్దకు పంపించినట్లు తెలియజేశారు. అలాగే ఆర్టీసీ అధికారులకు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా పంపించినట్లు తెలియజేశారు.


ఇక మీదట బస్సులలో ట్రైన్లలో పాన్ మసాలా గుట్కాలను రవాణా చేయడం కూడా నిషేధం విధించినట్లుగా తెలియజేశారు. దీని పైన అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తోంది .ఇప్పటికే ఇలాంటి వాటిని తమిళనాడులో కూడా బ్యాన్ చేశారు.. దీంతో మహిళలు సైతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇలాంటి వాటిని అరికడితేనే ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారంటూ తెలియజేస్తున్నారు.ఇకమీదట తెలంగాణలో ఇలాంటివి అమ్మితే వారికి కఠినమైన చర్యలు ఉంటాయని కూడా తెలియజేశారు. ముఖ్యంగా గుట్కా నమలడం వల్ల ఆరోగ్యానికి చాలా హానికరం పళ్ళ మీద మరకలు పసుపు రంగు మచ్చలు కూడా ఏర్పడతాయి.. వీటితో పాటు చాలా నష్టాలు ఉంటాయని కూడా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: