మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ మరియు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఎన్నికల షెడ్యూల్ రాక ముందే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న ప్రధాన పార్టీ నేతలు , కార్యకర్తలు , ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇక ఎన్నికలు ముగిశాక రిజల్ట్ డే కి మధ్య లో చాలా రోజులు గ్యాప్ ఉండడంతో నేతలంతా సైలెంట్ అయిపోతారు అని అనుకున్నారు. కాకపోతే వారంతా ప్రస్తుతం మేము గెలుస్తాము అంటూ వాద ప్రతి వాదనలు చేసుకుంటూ వెళుతున్నారు.

ఇకపోతే ఈ సారి పోయిన సారి కంటే కాస్త ఎక్కువ పర్సంటేజ్ ఓట్లు పోల్ కావడంతో అది మాకు కలిసి రాబోతుంది , అంటే మాకు కలిసి రాబోతుంది అని చాలా మంది చెబుతున్నారు. ఇకపోతే చాలా రోజులుగా కూటమి నేతలు , కార్యకర్తలు అభిమానులు అంతా కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ మాకే భారీగా పడబోతున్నాయి అని , ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పై ప్రభుత్వ ఉద్యోగస్తులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. దానితో వారంతా మాకే ఓట్లు వేయడానికి ఆసక్తి చూపించారు అని చాలా రోజులుగా చెబుతూ వస్తున్నారు.

ఒక వేళ వారు చెప్పింది నిజమే అయినా కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏమి భారీ సంఖ్యలో ఉండవు. చాలా తక్కువ శాతం మాత్రమే ఉంటాయి. ఆ ఓట్ల ద్వారా చిన్న చిన్న రిజల్ట్ లు తారుమారు అవుతాయేమో కానీ , అన్ని ప్రాంతాలలో అలా జరగదు. ఇక నిజం గానే వారు చెప్పినట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువ శాతం వారికే పడ్డ ఆ తర్వాత మెయిన్ ఓట్ల లెక్కింపు సమయం నుండి వారికి అసలు కండం ప్రారంభం అవుతుంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: