తెలుగుదేశం పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని చంద్రబాబుపై ఎవరు విమర్శలు చేసినా ధీటుగా బదులిచ్చే గొప్ప నేతలలో అచ్చెన్నాయుడు ఒకరు. టీడీపీకి అండగా నిలబడే బలమైన నేతలలో అచ్చెన్నాయుడు ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చెన్నాయుడు టీడీపీ నేత ఎర్రన్నాయుడు తమ్ముడు కాగా శ్రీకాకుళం రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు.
 
టీడీపీలో అచ్చెన్నాయుడు చాలా స్పెషల్ అని ఆ పార్టీ నేతలు భావిస్తారు. అచ్చెన్నాయుడు ఇచ్చిన సలహాలు, సూచనలకు చంద్రబాబు సైతం ఎంతో గౌరవం ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది. 2009 సంవత్సరం వరకు మూడుసార్లు  హరిశ్చంద్రపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడు నియోజకవర్గాల పునర్విభజన వల్ల తర్వాత రోజుల్లో టెక్కలి నుంచి పోటీ చేశారు.
 
2014 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలోని మెజారిటీ స్థానాలలో టీడీపీ విజయం సాధించడానికి అచ్చెన్నాయుడు కారణం కావడంతో ఆయనకు కార్మిక శాఖా మంత్రిగా పని చేసే అవకాశం దక్కింది. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ఉన్నా అచ్చెన్నాయుడు మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారంటే ప్రజల్లో ఆయనంటే ఎంత నమ్మకం ఉందో సులువుగా అర్థం అవుతుందనే సంగతి తెలిసిందే.
 
చంద్రబాబుకు కొండంత అండలా నిలిచే నేతలలో అచ్చెన్నాయుడు ఒకరని ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అచ్చెన్నాయుడుపై జగన్ సర్కార్ కొన్ని అరోపణలు చేయడంతో పాటు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం భయపడలేదు. అచ్చెన్నాయుడు వయస్సు 53 సంవత్సరాలు కాగా ఒకింత దూకుడుతో రాజకీయాలు చేస్తూ ఆయన సత్తా చాటుతున్నారు. 2024 ఎన్నికల్లో సైతం టెక్కలి నుంచి అఛెన్నాయుడు పోటీ చేయగా ఈ ఎన్నికల్లో ఆయన గెలవడం ఖాయమని నియోజకవర్గంలో ఆయనకు తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో అచ్చెన్నాయుడు మరింత సక్సెస్ కావాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆయన ఒక్క ఫోన్ కాల్ దూరంలో మాత్రమే ఉంటారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: