తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నికల ఫలితాల ముంగిట... తెలుగుదేశం పార్టీ కీలక నేత మరణించారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి విజయ డైరీ డైరెక్టర్ ఎర్నేని సీతాదేవి మరణించారు. ఇవాళ ఉదయం పూట... విజయ డైరీ డైరెక్టర్ ఎర్నేని సీతాదేవి గుండెపోటుతో మరణించినట్లు సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

 ఇవాళ హైదరాబాద్ లో ఉదయం పూట టిడిపి మాజీ మంత్రి... ఎర్నేని సీతాదేవి గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ తరుణంలో సీతాదేవి కుటుంబం విషాదఛాయాల్లోకి నెట్టి వేయబడింది. అటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా... మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. టిడిపి మాజీ మంత్రి... ఎర్నేని సీతాదేవి మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.

 తెలుగుదేశం పార్టీ అగ్ర నేతలు, అధినేత చంద్రబాబు నాయుడు, ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. కాగా సీతాదేవి స్వస్థలం ఏలూరు జిల్లా అన్న సంగతి తెలిసిందే. ఏలూరులోని కైకలూరు మండలం, కోడూరు గ్రామం. ముదినేపల్లి నియోజకవర్గం నుంచి సీతాదేవి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985 సంవత్సరం అలాగే 1994 సంవత్సరం  లో అసెంబ్లీ ఎన్నికల్లో మద్దినేపల్లి నుంచి సీతాదేవి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది.

 అంతేకాకుండా... అలనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా కూడా సీతాదేవి పని చేశారు. అప్పుడు విద్యాశాఖలో అనేక రకాల సంస్కరణలను కూడా  తీసుకువచ్చారు సీతాదేవి. అంతేకాకుండా విజయ డైరీ డైరెక్టర్ గా కూడా ఎర్నేని సీతాదేవి పనిచేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఆమె అంత్యక్రియలు హైదరాబాద్ లో చేస్తారా లేక ఆమె సొంత గ్రామంలో చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. రేపు సీతాదేవి అంతక్రియలు జరగనున్నట్లు సమాచారం అందుతుంది. కాగా, ఎర్నేని సీతాదేవి మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు టీడీపీ నేతలు .


మరింత సమాచారం తెలుసుకోండి: