వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి  పోలింగ్ ముగిసింది. ఈ మూడు జిల్లాల పరిధిలోని పట్టభద్రులంతా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో వారు ఎవరికి ఓటు వేశారు..ఎవరు ఈ ఉప ఎన్నికల్లో గెలవబోతున్నారు అనే వివరాలు చూద్దాం.. ఇందులో బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలు ప్రధానమైన నాయకులు గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. దక్షిణ తెలంగాణలో పట్టభద్రులు ఎవరు ఏ వైపు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, బిజెపి నుంచి  ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు.

మరి ఈ ముగ్గురిలో గెలుపు ఎవరు సాధిస్తారు.. ఈ ఎన్నికల్లో ఖమ్మం, నల్గొండ పట్టభద్రులే కీలకం.. ప్రస్తుతం కాంగ్రెస్ కి ఈ ఎన్నిక సవాల్ గా మారింది. ఈ ఎన్నికలకు సంబంధించి బాధ్యతను ఆయా జిల్లాల మంత్రులకు అప్పగించారు రేవంత్ రెడ్డి. నల్గొండలో కోమటిరెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మంలో పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్లో కొండా సురేఖ, సీతక్క  మొత్తం ఆరుగురు మంత్రులు రంగంలోకి దిగారు. తీన్మార్ మల్లన్నను గెలిపించాలని  వీరంతా ఒక్కటై ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం కేటీఆర్, హరీష్ రావు సహా ఆ పార్టీ ముఖ్య నేతలు అంతా ఎన్నికపై దృష్టి పెట్టారు.

 రేవంత్ సర్కార్ 6 గ్యారంటీల అమలులో విఫలమైందని  ప్రజలంతా బిఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నారని వారు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పట్టు చూపించిన బిజెపి ఎంపీ స్థానాల్లో కూడా గట్టిగానే గురి పెట్టింది. మోడీ పాలనపై ప్రజలకు విశ్వాసం ఉందని పట్టభద్రులు కూడా బిజెపికే ఓటు వేస్తారని వారు అంటున్నారు. ఈ విధంగా మూడు పార్టీల నాయకులు ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉన్నారు. కానీ ప్రధానంగా పోటీ బిఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య ఉంటుందనేది తెలుస్తోంది. మరి చూడాలి తీన్మార్ మల్లన్న విజయం సాధిస్తారా లేదంటే , రాకేష్ రెడ్డికి పట్టం కడతారా అనేది ఈ ఉప ఎన్నిక రిజల్ట్ రోజు తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: