నారా చంద్రబాబు కుమారుడు అయినటువంటి నారా లోకేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన గత కొంత కాలంగా తెలుగు దేశం పార్టీలో అత్యంత కీలక బాధ్యతలను చేపట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే లోకేష్ పోయిన అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి స్థానం నుండి పోటీ చేశారు. ఈయన దాదాపుగా గెలుస్తాడు అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా లోకేష్ ఓడిపోయారు.

దానితో తెలుగు దేశం పార్టీ నేతలు , కార్యకర్తలతో పాటు ఎంతో మంది ప్రజలు కూడా నారా లోకేష్ ఓడిపోవడం ఏమిటి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే ఆయన మంగళగిరి నుండి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో గెలవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాంతం పై , అక్కడ ఉన్న సమస్యలపై ఎంతో అవగాహనను తెచ్చుకొని జనాలలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా లోకేష్ , మంగళగిరి స్థానం నుండి పోటీ చేశారు. ఇక పోయిన సారి జరిగిన తప్పులను ఈ సారి జరగకుండా చూసుకుంటూనే ప్రజలకు అక్కడి ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అని తెలుసుకుంటూ వచ్చాడు. ఇక తెలుగు దేశం పార్టీ లో కీలక వ్యక్తి అయినప్పటికీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను వదిలేసి మంగళగిరి పైనే దృష్టి పెట్టడంతో ఇక్కడి ప్రజలు కూడా ఈయనకు ఈ సారి భారీగా ఓట్లు వేసినట్లు తెలుస్తోంది.

దానితో మంగళగిరి నుండి పోయినసారి ఓడిపోయిన లోకేష్ ఈ సారి భారీ మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉంది అని ఆయనకు 10 , 20 , 30 వేల మెజార్టీ వచ్చిన పెద్ద ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అని పరిణామాలు కనబడుతున్నాయి. మరి ఇదే జరిగితే ఓటమి నుండి భారీ మెజార్టీ తెచ్చుకున్న నేతగా లోకేష్ నిలుస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nl