ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన జిల్లాలలో గుంటూరు జిల్లా ఒకటి. ఈ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ జిల్లాలో రెండు ప్రపంచ స్థాయి ప్రఖ్యాతి పొందిన వ్యాపారాలు ఉన్నాయి. గుంటూరు పొగాకు సాగుకు పెట్టింది పేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరే జిల్లాలో పండినంత పొగాకు పంట ఇక్కడ పండుతుంది. ఇక్కడ భారీగా పొగాకు పండేందుకుగాను వాతావరణం కూడా ఈ జిల్లాకు ఎంతగానో అనుకూలిస్తుంది. దానితో ఇక్కడ పొగాకు సాగు విరివిగా సాగుతుంది.

ఇకపోతే ఇక్కడ పండిన పొగాకు ను కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా విదేశాలకు కూడా తరలిస్తున్నారు. దాని ద్వారా రాష్ట్రానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. ఇంత స్థాయిలో గుంటూరు జిల్లా పొగాకు ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తూ ఉంటే దీనిని మరింత డెవలప్ చేయడంలో మాత్రం ప్రభుత్వాలు కాస్త విఫలం అయ్యాయి అని చెప్పవచ్చు. గుంటూరు జిల్లాలో పొగాకు బోర్డు ఉంది. కానీ దాన్ని మరింత డెవలప్ చేస్తే బాగుంటుంది అని ఈ రాష్ట్రంలో పొగాకు పండించే రైతులు , అలాగే ఈ జిల్లా వాసులు కోరుకుంటున్నారు.

ఇక గుంటూరు జిల్లాలో పొగాకు తో పాటు మిర్చి పంట కూడా భారీగా పండుతూ ఉంటుంది. మిర్చిలో కూడా ఈ జిల్లా మొదటి స్థానంలో నిలుస్తోంది. ఇక్కడి మిర్చి కి ఎంతో గొప్ప పేరు ఉంది. రాష్ట్రం లోనే కాదు దేశంలో కూడా అనేక మంది ఇక్కడ మిర్చిని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. దానితో ఇక్కడ మిర్చి దేశ విదేశాలలో ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇంతటి గుర్తింపు కలిగిన ఇక్కడి మిర్చి కి మిర్చి బోర్డు లేకపోవడం ఆశ్చర్యం. దీనికి మిర్చి బోర్డును కచ్చితంగా ఏర్పాటు చేయాలి అని ఇక్కడి మిర్చి రైతులు, ఈ జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. ఇలా గుంటూరు పొగాకు , మిర్చికి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఈ పంటలను పండించేందుకు మరియు వీటిని అద్భుతమైన స్థాయిలో ఎగుమతి చేసేందుకు మరిన్ని వసతులు ప్రభుత్వాలు కల్పించాలని ఇక్కడి రైతులు , ప్రజలు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: