తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు రేవంత్ రెడ్డి ఊహించని శాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు వాడని  కొత్త బీర్లు తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేశారట. కొత్త కొత్త పేర్లతో ఈ బీర్లను లాంచ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైనట్లు గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేసింది గులాబీ పార్టీ.

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా... లైట్ బీర్ల కొరత ఉన్న సంగతి తెలిసిందే. ఎండాకాలం కావడంతో అందరూ లైట్ బీర్లు తాగేందుకు ఆసక్తి చూపించారు. సాధారణంగానే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా బీర్లు తాగుతారు జనాలు. బీర్లు తాగే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా కేఎఫ్ లైట్ బీర్లు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా విక్రయాలు జరుపుకుంటాయి.

అయితే ఆ కేఎఫ్‌ లైట్ బీర్లు తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ అయిపోయాయి. దీంతో ఎండాకాలంలో చాలా  మంది మందుబాబులు బీర్ల కోసం ఇబ్బందులు పడ్డారు. అయితే ఇది కృత్రిమ కొరత అని.. గులాబీ పార్టీ చెబుతోంది. కృత్రిమ కొరత ఏర్పాటు చేసి.. కేఎఫ్‌ లైట్‌ బీర్లు అందించడం లేదని పేర్కొంది బీఆర్‌ఎస్‌ పార్టీ. ఇక ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని మించి పోయేలా... కొత్త బీర్లను రేవంత్‌ సర్కార్‌ తీసుకొస్తుందని ఆరోపణలు చేసింది బీఆర్‌ఎస్‌ పార్టీ.

తెలంగాణ రాష్ట్రంలో తమ బీర్ బ్రాండ్‌లను సరఫరా చేయడానికి ప్రభుత్వ అనుమతిని సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీ పొందినట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ చెబుతోంది. సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీ నుంచి.. కొత్త బీర్లను రేవంత్‌ సర్కార్‌ తీసుకొస్తుందని ఆరోపణలు చేసింది.  5 వేల కోట్ల రూపాయల స్కాం కోసం.... ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రి తమ్ముడు ఈ తతంగాన్ని నడిపిస్తున్నాడట. రేవంత్‌ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతోందట. మరో నెల రోజుల్లోనే.... తెలంగాణ రాష్ట్రంలో కొత్త బీర్లు వస్తాయట. దీంతో మందుబాబులు భయపడుతున్నారు. ఏపీలో కల్తీ మందు తాగి.. చాలా మంది చనిపోయారు. ఇప్పుడు తమకు అలాగే అవుతుందని ఆందోళన చెందుతున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: