కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అయితే తమ జీవితాలు మారిపోతాయని ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని సీమ యువత భావిస్తోంది. మెకానికల్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఐటీఐ చదివిన విద్యార్థులు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతుందని తమ తలరాతలు మారిపోతాయని భావిస్తుండగా ఆ కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కుదరదని కొన్ని నెలల క్రితం సంచలన ప్రకటన చేసింది.
 
సాంకేతికంగా, ఆర్థికంగా కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్రకటన చేసి మోదీ సర్కార్ ఏపీ యువతకు ఒకింత భారీ షాకిచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేసిన కేంద్రం కడప స్టీల్ ప్లాంట్ విషయంలో సహాయసహకారాలు ఆశిస్తుందని భావించడం అత్యాశే అవుతుందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. కడప స్టీల్ ప్లాంట్ తో సీమ యువత భవిత బంగారమవుతుంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామనే కల కలగానే మిగిలిపోవడం గమనార్హం. ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తారని ప్రకటించినా పనులు పునాది రాయి దాటకపోవడం గమనార్హం. ఏళ్లు గడుస్తున్నా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఫలితం సున్నా అని సైతం సీమవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
ఏపీ అసెంబ్లీలో కడప స్టీల్ ప్లాంట్ కు సంబంధించి మాటల యుద్ధం కూడా జరిగింది. కేంద్రం సహాయసహకారాలు రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలో ముందుకెళ్లడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ లో ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా కడప స్టీల్ ప్లాంట్ కు పట్టిన గ్రహణం వీడలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ దశ, దిశ కడప స్టీల్ ప్లాంట్ తో మారుతుందని చాలామంది భావించగా అందుకు భిన్నంగా జరగడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: