తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అందరూ మైనంపల్లి హనుమంతరావు గురించి మాట్లాడుకుంటున్నారు. మొన్నటి వరకు గులాబీ పార్టీలో ఉండి... హైదరాబాద్ మహానగరంలో టైగర్ లా తిరిగారు. భారీ బందోబస్తు, హై సెక్యూరిటీ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా...  మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నియోజకవర్గం శాసించారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత... పరిస్థితి పూర్తిగా మారిపోయింది.


ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో త్యాగరాజులా మారిపోయారు మైనంపల్లి హనుమంతరావు.  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పదవులు ఇస్తానని చెప్పినా కూడా... వద్దు వద్దు అంటున్నారు మైనంపల్లి హనుమంతరావు. ఏదైనా పదవులు ఇస్తే నాకు కాకుండా నా కొడుకుకు ఇవ్వండి అంటూ త్యాగరాజు లాగా మారిపోయాడు.

గులాబీ పార్టీలో ఉన్న సమయంలో... తన కొడుకుకు కెసిఆర్ టికెట్ ఇవ్వలేదు. కేవలం మైనంపల్లి హనుమంతరావుకు మల్కాజ్గిరి టికెట్ ఇచ్చారు. దీంతో తన కొడుకు.. టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన టికెట్ ను త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు మైనం పల్లి హనుమంతరావు . అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరికీ టికెట్లు వచ్చాయి. కానీ మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి నియోజకవర్గం లో ఓడిపోయారు. మెదక్ నియోజకవర్గం నుంచి మైనంపల్లి హనుమంతరావు కొడుకు మైనంపల్లి  రోహిత్ విజయం సాధించారు.

అయితే మొన్న... మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కూడా ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చిందట. కానీ మైనంపల్లి హనుమంతరావు మరోసారి త్యాగరాజులాగా మారిపోయాడని వార్తలు వస్తున్నాయి. తనకు ఎంపీ టికెట్ వద్దని చెప్పాడట. కానీ వచ్చే కేబినెట్ విస్తరణలో... తన కొడుకు మైనంపల్లి రోహిత్ కు... మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట ఆ మైనంపల్లి. అందుకే అప్పుడు మల్కాజిగిరి టికెట్ వదులుకున్నారట. ఇలా తన కొడుకు కోసం త్యాగరాజు లాగా... మైనంపల్లి మారిపోయాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి మైనంపల్లి హనుమంతరావు కోరికను కాంగ్రెస్ పార్టీ తీర్చుతుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: