ఏపీలో ఏ పార్టీ అధికారం వస్తుందని విషయం చెప్పడం చాలా కష్టంగా మారింది. అయితే ఒకవేళ ఎవరు వచ్చినా కూడా పాలన అంత ఈజీ కాదు అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇప్పటికే ప్రజలు చాలా స్పష్టమైన తీర్పును కూడా ఇచ్చారు. కేవలం ఈవీయంలో మాత్రమే నిక్షిప్తంగా దాగివుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలుబడునున్నాయి .తొమ్మిదవ తేదీన కొత్త ప్రభుత్వం పాలన మొదలు కాబోతోంది. అయితే ఇచ్చిన హామీలు అభివృద్ధి ఉద్యోగ కల్పన వంటి అమలు విషయం ఆశామాసి విషయం కాదు.


కొత్త పాలన కుదుటపడాలి అంటే కచ్చితంగా రెండు సంవత్సరాలు పైనే అవుతుంది. ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న వాటిని కొనసాగింపు ఉంటుంది. అదే కూటమి వస్తే చంద్రబాబుకు మాత్రం కత్తి మీద సామే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ సర్కార్ 12 లక్షల కోట్ల అప్పు ఉన్నదని భరించాల్సిన అవసరం కొత్త ప్రభుత్వం పైన ఉంటుంది. అలాగే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని హామీలను కూడా అమలు చేయాలి. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇస్తామంటూ ఊదరగొట్టారు కూటమి.

మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ప్రతి ఇంట్లో ఆర్థిక భరోసా, పిల్లల చదువుకు ప్రోత్సాహం, రైతు భరోసా పెట్టుబడి 20,000.. 20 లక్షల ఉద్యోగాలు.. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు.. ఇవే కాకుండా చాలా హామీలను కూడా కూటమి మేనిఫెస్టోలో ప్రకటించింది. గతంలో సంక్షేమానికి దూరంగా ఉండే చంద్రబాబు.. ఏకంగా ఈసారి తాము అధికారంలోకి రావడానికి ఎన్నో పథకాలను సైతం ప్రకటించుకున్నారు. అసలు వీటన్నిటిని అమలు చేస్తారా లేదా అనే విషయం పైన కూడా సందేహంగా ఉన్నది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది సామాజిక పింఛన్ ని పొందుతున్నారు 4వేలకు పెంచుతానని చెప్పిన చంద్రబాబు అంతేకాకుండా దివ్యాంగులకు కిడ్నీ బాధితులకు కూడా పెంచుతానని చెప్పారు.


అలాగే డెవలప్మెంట్ కూడా చేస్తానని చెప్పడమే కాకుండా సంపద సృష్టించి సంక్షేమం అభివృద్ధి చేపడతానని చెప్పారు.ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే కొత్త పథకాలు అమలు చేయాల్సిన పనిలేదు. ఉన్నవాటిని కొనసాగిస్తే సరిపోతుంది. మరి ఏం జరుగుతుందో నాలుగవ తేదీ చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: