ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు చదువు అంటే చాలా చులకనగా ఉండేది.  కేవలం ధనవంతులకు మాత్రమే చదువు అనేది అందేది. జగన్ ప్రభుత్వంలో నాడు నేడు కింద కిందిస్థాయి నుంచి  బెస్ట్ స్టడీ అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తూ వచ్చింది. ఆ కృషికి తగిన ఫలితం ప్రస్తుతం లభిస్తోంది. మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్లేస్మెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. దానికి ప్రధాన ఉదాహరణ పాలిటెక్నిక్ అని చెప్పవచ్చు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఇంతవరకు మనం ఇంజనీరింగ్ చదివితేనే లక్షలాది రూపాయల జీతంతో ప్లేస్మెంట్స్   దొరుకుతుందని అపోహ ఉండేది. 

అంతేకాకుండా ఈ స్టడీ చేస్తేనే ఎక్కువగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి.  ఎంబీఏ, ఎంసీఏ,  ఎమ్మెస్సీ స్టాండర్డ్ స్టడీ చేస్తేనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇతర ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలు వచ్చేవి. కానీ పాలిటెక్నిక్ అంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తూ  వచ్చారు. కానీ ప్రస్తుత కాలంలో వారికి సంబంధించి సంస్థలు పెరుగుతున్నాయి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. కొత్త కొత్త కంపెనీలు వచ్చినప్పుడు వారికి సాంకేతికంగా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో సాంకేతికంగా నైపుణ్యం ఉన్న వ్యక్తులు జాబ్ చేయడానికి కావాలి.

అలాంటి సాంకేతికతలో ఏకైక స్టడీ ఏంటంటే పాలిటెక్నిక్. ఏపీలో పాలిటెక్నిక్ కు బ్రాండ్ ఇమేజ్ మొదలైంది. ఈ ఇమేజ్ ఇంతకుముందు   తమిళనాడుకు  ఉండేది. ఐఐటి, ఎన్ఐటి విద్యార్థులకు మాత్రమే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇచ్చే సంస్థలు, తొలిసారిగా ఏపీలో పాలిటెక్నిక్ సంబంధించిన స్టడీ చేసినటువంటి విద్యార్థులపై దృష్టి పెట్టాయి. చాలా పాలిటెక్నిక్ కాలశాలల్లో జాబ్ డ్రైవ్ నిర్వహించి 18 సంవత్సరాల స్టూడెంట్స్ కే ఎనిమిది లక్షలకు పైగా ప్యాకేజీ ఇస్తున్నాయి. ఈ విధంగా ఏపీలో చిన్న వయసులోనే ఉద్యోగాలు అందుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అలాగని అందరికీ ఎనిమిది లక్షల ప్యాకేజీ ఉండదు.  వారి టాలెంటును బట్టి ఇంటర్వ్యూ పర్ఫామెన్స్ ను బట్టి  8 లక్షల నుంచి మూడు లక్షల వరకు  ప్యాకేజీలతో జాబ్ ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: