ఎక్కడైనా సరే రాజకీయ నాయకులు అంటే వారికి అవసరాల కోసం ఊకొడుతూ ఉంటారు.. ముఖ్యంగా ప్రసంగాలు వారి వారి స్వార్ధ ప్రయోజనాల కోసమే కార్యకర్తలను రెచ్చగొట్టేటువంటి స్టేట్మెంట్లను సైతం ఇస్తూ ఉంటారు తప్ప.. బ్లైండ్ గా ఫాలో అవ్వకూడదని ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటినుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రాలో ఎన్నికల సమయంలో జరిగిన కొట్లాటలు వాటి తాలూకా కేసులు బెయిలు శిక్షలు అనేవి ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

అయితే ఈ వ్యవహారంలో నాయకులు మాత్రం సేఫ్ గానే ఉంటున్నారు.ఆ నాయకుల మాటలు విని కార్యకర్తలు బలైపోతున్నారు. ఎన్నికల సమయంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తు ఉంటాయి. ఏ కార్యక్రమం లో ఎక్కువ కేసులు ఉంటాయో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి పెద్ద పెద్ద పదవులు ఇస్తామంటూ తెలియజేశారు. ఈ విషయాలను విని చాలామంది చెలరేగిపోయారు. అదే అలవాటుగా మారిపోయింది ఏమో కానీ ప్రస్తుతం కార్యకర్తలు మాత్రం జైలులో మగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది.


ఏ రాజకీయ పార్టీలోనైనా సరే నాయకులు తమ పైన ఎన్ని కేసులు ఉన్నాయో అభియోగాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు.అయితే వారు మాత్రం వేలు సంపాదించుకుంటారు వారి కోసం పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు మాత్రం ఘర్షణ అల్లర్లలో పాల్గొంటూ జీవితాలను బలి చేసుకుంటున్నారు. వాస్తవానికి రాజకీయ అల్లర్లు ఘర్షణలో తలపడే కార్యకర్తలు చాలామంది కూడా సామాన్యులే దీంతో కేసుల్లో చిక్కుకొని లక్షల రూపాయలు ఖర్చు చేసి మరి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. పల్నాడు జిల్లాలో హింసకాండ ఇప్పటివరకు వందమందికి పైగా అరెస్టు చేశారు కేవలం ఇందులో 20 మందికి మాత్రమే బెయిల్ వచ్చింది. సుమారుగా ఇప్పటికే 10 రోజులకు పైగా మిగిలిన వారు జైల్లోనే ఉన్నారు.


అలాగే తాడిపత్రి ప్రాంతంలో ఏడు కేసులలో 102 మంది అరెస్టు అవ్వగా.. ఇందులో ఎవరికీ బయలు దక్కలేదు. గత ఏడాది పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా 300 మంది అరెస్టు చేయగా.. ఆ వ్యవహారంలో వారంతా సుమారుగా 45 రోజులపాటు జైల్లో ఉన్నారు. కొంతమంది నాయకులు సభలలో ఇలాంటి వాక్యాలు చెప్పడం వల్ల కార్యకర్తల జీవితాలే నాశనం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: