కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్... స్పందించారు. భారతదేశవ్యాప్తంగా ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటివరకు... ఆరు దశల్లో  దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మరో విడత ఎన్నిక జరిగితే... పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగుస్తుంది. ఇక జూన్ 4వ తేదీన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.


ఇలాంటి నేపథ్యంలో దేశ రాజకీయాల్లో ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోకి రఘురాం రాజన్  వస్తున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గతంలో ఆర్బిఐ గవర్నర్గా రఘురాం రాజన్ పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం... ఆయన కాంగ్రెస్కు అప్పుడప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ కనిపిస్తూ ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా సలహాలు అందించేందుకు ముందుకు రఘురామ రాజన్. రేవంత్ రెడ్డి సర్కార్ కు ఆయన సలహాదారుడుగా కూడా ఉంటారని అప్పట్లో ప్రచారం జరిగింది.

 కానీ ఆయన సైలెంట్ అయిపోయారు. ఇక రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో నిర్వహించిన జోడో యాత్రలో కూడా ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సందడి చేశారు. దీంతో అప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరబోతున్నారని అందరికీ క్లారిటీ వచ్చింది. ఇక ఈ మధ్య కాలంలో కూడా ఈ వార్త బాగా వైరల్ అయింది. దీనిపై స్వయంగా రఘురాం రాజన్ క్లారిటీ ఇచ్చారు.

 తాను రాజకీయాల్లోకి రావడం తన కుటుంబానికి అసలు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు... కానీ ఈ విషయంపై ప్రజలు ఎవరు నమ్మడం లేదు అన్నారు. నేను ప్రభుత్వంలో ఉన్న... లేకపోయినా... కాంగ్రెస్ వారి విధానాలు తప్పుదారి పడితే కచ్చితంగా ప్రశ్నిస్తా అని తెలిపారు. రాహుల్ గాంధీ చాలా తెలివైనవాడు అలాగే ధైర్యవంతుడు అన్నారు. నేను ఆయనకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదని తెలిపారు రఘురాం రాజన్.

మరింత సమాచారం తెలుసుకోండి: