ఆంధ్రప్రదేశ్లోని సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈసీ అధికారులు ప్రత్యేకమైన నిఘాను సైతం ఉంచి సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్టులతో సహా ఇతరత్రా ప్రాంతాలలో 150 చెక్ పోస్టులతో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 35 మొబైల్ బోర్డు పెట్రోలింగ్ లను ఏర్పాటు చేశారు వీటన్నిటితోపాటు 18 టెంపర్ అని చెక్ పోస్ట్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈసారి చెక్పోస్టుల వద్ద పట్టుబడిన నగదు మద్యం వివరాలను తాజాగా ఈసీ అధికారులు వెల్లడించారు. వీటి వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం.


2019లో జరిగిన ఎన్నికలలో భాగంగా పట్టుబడిన నగదు మద్యం మాదకద్రవ్యాలు లోహాల విలువ తో పాటు ఈసారి ఎన్నికలలో జరిగిన అక్రమ రమాణా వివరాలను కూడా వెల్లడించింది. 2019లో పట్టుబడిన నగదు 41.80 కోట్లని..7,305 మంది అరెస్టు చేశారంటూ తెలిపారు ఇక మద్యం విషయానికి వస్తే 2019లో పట్టుబడిన అక్రమ మద్యం విలువ 8.07 కోట్లు అని.. 2024 లో పట్టుబడిన అక్రమ మద్యం విలువ 58.70 కోట్ల రూపాయలోని తెలిపారు. ఈసారి 61,543 అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు.

2019 ఎన్నికల సమయంలో పట్టుబడిన నిషేధిత మాదకద్రవ్యాల విలువ 5.04 కోట్ల రూపాయల కాగా 2024లో 35.61 కోట్లు అంటే తెలిపారు. ఇందులో మొత్తం మీద 1730 మందిని అరెస్టు చేశామంటూ తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న లోహాల విలువ 27.17 కోట్లు.. 2024లో 123.62 కోట్ల రూపాయలు అంటూ ఎన్నికల కమిషనర్ తెలియజేసింది. 2019లో ఉచితాలు ఇతరస్త్ర వస్తువులు విలువ 10.63 కోట్లు అని..2024 లో 16.98 కోట్లు అంటూ ప్రకటించారు. మొత్తం మీద ఇందులో 233 మందిని అరెస్టు చేశామని అలాగే 346 వాహనాలను కూడా సీజ్ చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలియజేశారు. గతంలో పోలిస్తే ఈసారి ఎన్నికలకు అన్నిటిని కలుపుకొని చిక్కిన కోట్ల మొత్తం..234.28  అని తెలిసి ముక్కున వేలు వేసుకుంటున్నారు ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: