ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13 వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన రిజల్ట్ జూన్ 4 వ తేదీన రాబోతుంది. ఈ రిజల్ట్ రాబోయే ముందు అనేక కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక రిజల్ట్ మరికొన్ని రోజులు రాబోయే సమయంలో జనసేన అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీ ఎస్ , కే ఎస్ జవహర్ రెడ్డి పై అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు ఆయన ఎన్నో వందల ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నాడు అని , పేదలకు దక్కవలసిన భూములను లాక్కున్నారు అని , ఎన్నో అసైన్డ్ భూములను తాను తన కుమారుడు తమ పేరు మీద రాసుకున్నారు అంటూ అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమో అనేది ఎవరికి తెలియదు.

కానీ అంతలోనే ఈయనపై అనేక ఆరోపణలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇలా ఆరోపాలను వస్తున్న వేల ఆయన చేసిన మంచిని మొత్తం మరచిపోయి కేవలం ఆయన పై వస్తున్న ఆరోపణలే జనాల్లో బాగా తిరుగుతున్నాయి. ఈయన సి ఎస్ గా ఉన్న సమయంలో ఎన్నో మంచి పనులను చేశారు. అందులో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆక్రమ మద్యం , గంజాయి , ఇతర మత్తు పదార్థాలు రవాణా కాకుండా ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఈయన చర్యల ఫలితంగా ఆంధ్ర రాష్ట్రంలో చాలా వరకు అక్రమ మద్యం , గంజాయి ఇతర మత్తు పదార్థాల రవాణా ఆంధ్ర రాష్ట్రంలోకి చాలా వరకు ఆగిపోయింది.

వీటి ద్వారా ఎంతో మంది యువత భవిష్యత్తు బాగుపడింది. ఇలా ఈ ఒక్క వ్యవస్థపై మాత్రమే కాకుండా అనేక వ్యవస్థలపై తనదైన పని తీరుతో ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మంచి చేశారు. ఇలా సి ఎస్ గా తాను ఉన్న సమయంలో ఎన్నో మంచి పనులు చేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం , అక్కడి ప్రజల బాగుకోసం పని చేసిన ఈయనపై ఇలాంటి ఆరోపణలు సరికాదు అని అనే కమంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Jr