ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సారి జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో తెలుగుదేశం , జనసేన , బీజేపీ మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. అందులో దాదాపుగా తెలుగు దేశం పార్టీ నుండి చాలా రోజులుగా పిఠాపురం సీటును వర్మ గారు ఆశించారు. టీడీపీ పార్టీ కూడా అందుకు అనుకూలంగానే ఉంటూ వచ్చింది. కానీ ఎప్పుడు అయితే టిడిపి , జనసేన పొత్తు అయ్యాయో అప్పుడే సీన్ మారింది. వర్మకు కాకుండా ఆ ప్రాంత సీట్ ను జనసేన అధ్యక్షుడు అయినటువంటి పవన్ తీసుకున్నాడు.

ఇక పవన్ తీసుకున్న తర్వాత వర్మ తో కొన్ని మంతనాలు జరిపి ఆయనను పార్టీ నుండి బయటకు వెళ్లకుండా స్వయంగా ఆయనే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ముందుండి కార్యాచరణను మొదలు పెట్టేలా చేశారు. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామంలో జనసేన పార్టీకి మంచి ఓట్లు వచ్చేలా ఆయన అనేక ప్రాణాలికలను రూపొందించాడు. ఇక వర్మ చెప్పినట్లే పవన్ కూడా ఫాలో అయ్యాడు. దానితో ఈయనకు మైలేజ్ ఫుల్ గా ఏర్పడినట్లు దాదాపు పిఠాపురంలో ఈయన విజయం కన్ఫామ్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే కొందరు ఈ మధ్య కాలంలో పవన్ పిఠాపురంలో గెలవడం కష్టమే , ఈ సారి కూడా పవన్ ఓడిపోతాడు అనే వార్తలు వస్తున్నాయి.

దీనిపై వర్మ చాలా గట్టిగా స్పందించాడు. తాజాగా వర్మ స్పందిస్తూ ... పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గెలుపు కోసం నేను ఎంతో కష్టపడ్డాను. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవడం కోసం చాలా కష్టపడ్డారు. కాకపోతే కొంత మంది పవన్ గెలవడు అని అంటున్నారు. కచ్చితంగా పవన్ ఈ సారి గెలుస్తాడు. ఆయన గెలుపు కోసం నా ఆస్తి మొత్తాన్ని నేను పండం కడతాను. ఆయన గెలుపు హామీ నాది అని చెప్పాడు. ఇలా వర్మ చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పడంతో మళ్లీ పిఠాపురంలో పవన్ గెలుపు ఖాయం అన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: