ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో... ఏపీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి  హాట్ టాపిక్ గా నిలిచారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా జవహర్ రెడ్డి ఉంటున్నారని నిత్యం తెలుగుదేశం కూటమి ఆరోపణలు చేస్తూనే ఉంది. కానీ జవహర్ రెడ్డి మాత్రం... నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా... తగ్గేదే లేదంటూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. ప్రజల పక్షాన ఉంటూ ముందుకు సాగుతున్నారు.

అయితే... కె.ఎస్. జవహర్ రెడ్డి తన కెరీర్‌ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. అలాగే ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా దక్కించుకున్నారు. డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి...తన కెరీర్‌ లో ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి వంటి విభాగాలలో గణనీయమైన కృషి చేశారు. డాక్టర్ జవహర్ రెడ్డి.. 1990 లో ఉద్యోగంలో చేరారు. ఆయనకు వైద్య పట్టా కూడా ఉంది. దీని వల్ల ఆరోగ్యరంగంలో ఆయనకు ఉన్న లోతైన అవగాహన వచ్చింది. తద్వారా ఈ రంగంలో ఆయన ముఖ్యమైన మార్పులను తీసుకొచ్చారు.

తన ప్రతిభావంతమైన కెరీర్‌లో అనేక కీలక పదొన్నతులను చేపట్టారు. కలెక్టర్‌గా, రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ కార్యదర్శి స్థాయి పదొన్నతులను చేపట్టారు. ఏ పోస్ట్‌ లో ఉన్నా...అందులో అనేక సంస్కరణలు చేశారు. ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు... ప్రజా ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి అనేక ఆరోగ్య కార్యక్రమాలను ప్రారంభించి, నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి రంగంలో గ్రామీణ మౌలిక సదుపాయాలు కల్పించారు. జీవనోపాధి మెరుగుపరచడంలో కూడా కృషి చేశారు.

ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్య కార్యదర్శిగా...ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూనే ఉన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఆయన పనితీరు విశేషంగా ప్రశంసనీయమైనది.  1986 లో ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్‌ అందుకున్నారు జవహార్‌ రెడ్డి. దూరదృష్టి నాయకత్వం, ప్రజా సేవ, సమగ్రతకు మారు పేరు జవహార్‌రెడ్డి. జటిలమైన పరిపాలనా సవాళ్లను సృజనాత్మక పరిష్కారాలతో అధిగమించే సామర్థ్యం అతని సొంతం. ఓవరాల్‌ గా ప్రజా పరిపాలనలో అద్భుతానికి ప్రతీక, అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విశేషమైన కృషి అందిస్తున్నారు డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: