ఈ మధ్య కాలంలోనే తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , ఒడిస్సా , కర్ణాటక రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ నాలుగు రాష్ట్రాలను కూడా బీజేపీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ నాలుగు రాష్ట్రాల నుండి భారీ ఎత్తున ఎంపీ స్థానాలను దక్కించుకోవాలి అని చాలా రోజుల నుండి బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే వస్తుంది. అందులో భాగంగా కచ్చితంగా ఈ నాలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున స్థానాలను దక్కించుకోవడానికి అనేక ప్రణాళికలను రచించింది.

ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎవరితో పొత్తుగా కాకుండా సింగిల్ గానే పోటీలోకి దిగింది. ఇక ప్రస్తుత పరిణామాలను చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి భారీ ఎత్తున ఎంపీ సీట్లు వచ్చే పరిస్థితులే కనబడుతున్నాయి. ఒంటరిగా వచ్చి కూడా ఇక్కడ భారీ సీట్లను రప్పించుకున్నట్లు అయితే ఈ ప్రాంతంలో బీజేపీ క్రేజ్ పెరిగినట్లే అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తెలుగు దేశం , జనసేన తో కలిసి పొత్తులో భాగంగా పోటీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పొత్తులో భాగంగా కూటమి కి భారీ ఎత్తున ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ ఉనికి గట్టిగానే ఉన్నట్లు అవుతుంది.

ఇక ఒడిశా , కర్ణాటక రాష్ట్రాల విషాయనికి వస్తే ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ కి కాస్త ప్రతికూల పరిస్థితులు కనబడుతున్నప్పటికీ భారీ ఎత్తున సీట్లు దక్కించుకుంటాం అని బీజేపీ అధిష్టానం గట్టిగా చెబుతూ వస్తుంది. ఈ రెండు రాష్ట్రాలలో కూడా బీజేపీ భారీ ఎత్తున సీట్లను కనుక దక్కించుకున్నట్లు అయితే మొదటి నుండి బీజేపీ టార్గెట్ చేసిన ఈ నాలుగు రాష్ట్రాలలో కూడా భారీగా సక్సెస్ అయినట్లే అవుతుంది. మరి ఈ నాలుగు రాష్ట్రాల రిజల్ట్ బీజేపీ కి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp