పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరం ఎన్నికలకు ముందు జనసేన అనే పార్టీని స్థాపించారు. కాకపోతే ఈయన పార్టీ స్థాపించిన చాలా తక్కువ రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు ఉండడంతో ఈయన ఆ దఫా ఎన్నికల్లో పోటీలోకి దిగలేదు. 2019 వ సంవత్సరం ఈయన పార్టీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో దిగింది. కాకపోతే ఇందులో జనసేన పార్టీ చాలా ఘోరమైన ఓటమిని చూడవలసి వచ్చింది. ఈ పార్టీ నుండి కేవలం ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే గెలిచాడు. పవన్ రెండు స్థానాల నుండి పోటీ చేయగా రెండిటిలో కూడా ఓడిపోయాడు.

2024 వ సంవత్సరానికి గాను ఆంధ్ర రాష్ట్రంలో మే 13 వ తేదీన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మనకు తెలిసిందే. పోయిన సారి చేసిన తప్పిదాలను ఈ సారి చేయకుండా పవన్ కేవలం ఒకే అసెంబ్లీ స్థానంలో పోటీలకు దిగారు. ఈయన ఈ సారి పిఠాపురం నుండి పోటీలోకి దిగారు. పోయినసారి ఈయన ఓడిపోవడంతో ఈ సారి కూడా ఓడిపోతాడేమో అని కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఈ సారి పవన్ చాలా పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్లడం , కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న చోట నుండి పోటీ చేయడం , తెలుగు దేశం , బీజేపీ సపోర్ట్ కూడా పవన్ కి ఈ సారి ఉండడంతో ఈయన భారీ మెజారిటీతో గెలుపొందుతాడు అని అనేక మంది భావిస్తున్నారు.

దీనితో పవన్ గెలుపు పై కాకుండా ఆయనకు ఎంత మెజారిటీ రాబోతుంది , కచ్చితంగా భారీ మెజారిటీ వస్తుంది అని భారీ మొత్తంలో బెట్టింగు లు బెట్టింగ్ రాయుళ్లు కాస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈయనకు గెలుపు దాదాపుగా కన్ఫామ్ అయ్యింది అని 10000 , 20,000 , 30,000 మెజారిటీ కూడా పిఠాపురంలో పవన్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ పై ఇంత ఘోరమైన ధీమాను వ్యక్తం చేస్తున్న జనాల అంచనాలు నిజం అయ్యేనో లేదో తెలియాలి అంటే జూన్ 4 వ తేదీ అయినటువంటి రిజల్ట్ డే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: