భారతదేశంలో ఇప్పటికే ఆరు విడతలుగా అనేక రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇంకా ఒక విడత ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జూన్ 4 వ తేదీన రిజల్ట్ రాబోతుంది. ఇందులో ఎవరు ఎక్కువ స్థానాలను గెలుచుకుంటారో వారే దేశంలో అధికారంలోకి వస్తారు. ఇకపోతే 2014 వ సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి దేశంలో అధికారంలోకి రావాల్సిన అన్ని స్థానాలను దక్కించుకొని అధికారంలోకి వచ్చింది.

ఇక ఆ తర్వాత 2019 వ సంవత్సరం ఈ పార్టీ రెండవ సారి అధికారం లోకి వచ్చింది. ఇక 2024 వ సంవత్సరం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా భారీ స్థానాలను దక్కించుకొని ముచ్చటగా మూడవ సారి అధికారంలోకి రావాలని బిజెపి ఎంతగానో ప్రయత్నం చేస్తుంది. ఇక మొదటి నుండి కూడా 400 పార్లమెంటు స్థానాలే లక్ష్యంగా బిజెపి పని చేస్తూ వస్తుంది.

కచ్చితంగా మేము 400 స్థానాలు ఈ సారి దక్కించుకుంటాము , అంతకన్నా ఎక్కువ స్థానాలే దక్కించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అని కూడా ఈ పార్టీ నేతలు , కార్యకర్తలు చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు. ఇక జాతీయ అంచనాల ప్రకారం బిజెపి ఒక విషయంలో ఫెయిల్ అయినట్లే తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... 400 అంతకన్నా ఎక్కువ పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బిజెపి పని చేసినప్పటికీ , ఈ పార్టీ 400 స్థానాలను దక్కించుకోవడం అసంభవం అని , కాకపోతే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది అదేమిటంటే బిజెపి నాలుగు వందల స్థానాలను దక్కించుకోవడంలో ఫెయిల్ అయినప్పటికీ దేశంలో అధికారంలోకి రావాలడానికి మాత్రం కావలసిన సంపూర్ణ మెజారిటీని తెచ్చుకుంటుంది అని వారు ఎవరి పొత్తు లేకుండా , ఎవరి సహాయం లేకుండా దేశంలో అధికారంలోకి వస్తారు అని జాతీయ రిపోర్టులు చెబుతున్నాయి. ఇలా నాలుగు వందల సీట్ల విషయంలో బిజెపి అంచనాలు తప్పుతున్న , చివరిగా మాత్రం అధికారంలోకి రాబోయేది బీజేపీ జాతీయ సర్వేలు అంచనా వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp